Navy – Chattrapati Shivaji : భారత నౌకాదళం అడ్మిరల్స్ యూనిఫామ్‌లో భుజాలపై ధరించే భుజ కీర్తుల కొత్త డిజైన్‌ను నేవీ ఆవిష్కరించింది. నౌకాదళం అధికారుల హోదాను బట్టి ఈ భుజకీర్తులు ఒక్కో రకంగా ఉంటాయి. డిసెంబరు 4న నేవీ డే సందర్భంగా వీటిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆవిష్కరిస్తూ.. ఈ భుజకీర్తులు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వానికి ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు. ఈ భుజకీర్తుల ఫొటోలను భారత నౌకాదళం తొలిసారిగా ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. వీటిలో వెరీవెరీ స్పెషల్ ఏమిటంటే.. ఎరుపు రంగులో ఉన్న అష్టభుజి ఆకారపు రాజముద్ర. ఈ అష్టభుజి లోపల మూడు సింహాల చిహ్నం ఉంటుంది. అష్టభుజిపై ‘సత్యమేవ జయతే’ అనే నినాదం రాసి ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
ఛత్రపతి శివాజీ మహారాజ్ రాజముద్ర కూడా అష్టభుజి ఆకారంలోనే ఉండేది. 8 భుజాలు అనేవి అష్ట దిక్కులకు ప్రతీక. నేవీ అడ్మిరల్స్ నూతన భుజకీర్తులపై 8 మూలలు కలిగిన నక్షత్రాలు కూడా ఉంటాయి. ఇవి తెలుపుదారంతో కుట్టబడి ఉంటాయి. అడ్మిరల్ హోదా కలిగిన వారి భుజకీర్తిపై 4 నక్షత్రాలు.. వైస్ అడ్మిరల్, సర్జ్ వైస్ అడ్మిరల్‌ల భుజ కీర్తులపై మూడు చొప్పున నక్షత్రాలు ఉంటాయి. ఇక రేర్ అడ్మిరల్, సర్జ్ రేర్ అడ్మిరల్ స్థాయి నేవీ అధికారుల భుజకీర్తులపై చెరో 2 నక్షత్రాలే ఉంటాయి. ఈ భుజకీర్తిని హైట్‌లో చూస్తే.. గోల్డెన్ బటన్, అష్టభుజి లోపల మూడు సింహాల చిహ్నం, టెలిస్కోప్ – భారతీయ ఖడ్గం, నక్షత్రాలు వరుసగా ఒకదాని కింద ఒకటిగా ఉంటాయి. వాస్తవానికి అంతకుముందు ఈ బ్యాడ్జీలో లాఠీ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో టెలిస్కోప్‌ను తీసుకొచ్చారు.
Also Read: Voting – Ram Lalla Idol : అయోధ్య రాముడి విగ్రహం ఎంపికపై ఓటింగ్
చరిత్రలోకి వెళితే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ నౌకాదళంలో 60 యుద్ధ నౌకలు, దాదాపు 5,000 మంది సైనికులు(Navy – Chattrapati Shivaji) ఉండేవారు. బాహ్య ఆక్రమణల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఆనాడు శివాజీ మహారాజ్ తన నేవీని బలోపేతం చేశారని అంటారు. బలమైన నౌకాదళం ప్రాముఖ్యతను తొలుత గ్రహించిన భారత పాలకుల్లో ఛత్రపతి శివాజీ కూడా ఒకరు. మహారాష్ట్రలోని విజయదుర్గ్, సింధుదుర్గ్ వంటి సముద్ర తీర ప్రాంతాలలోని కోటలను రక్షించేందుకు అప్పట్లో శివాజీకి చెందిన నౌకాదళం బలమైన పహారాను అందించేది. కొంకణ్ తీరం వెంబడి కూడా అనేక కోటలను శివాజీ నిర్మించారు.