shadow cabinet : ఒడిశాలో “షాడో కేబినెట్‌”..నవీన్‌ పట్నాయక్‌ కీలక నిర్ణయం

ప్రభుత్వం పనితీరుపై షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఒడిశాలో బీజేడీ సుదీర్ఘకాలం పాలన చేసింది. మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది.

  • Written By:
  • Publish Date - July 19, 2024 / 09:37 PM IST

shadow cabinet: ఒడిశా(Odisha) మాజీ ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌(Naveen Patnaik) బీజేపీ ప్రభుత్వం(BJP Govt) పనితీరును పరిశీలించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన”షోడో కేబినెట్‌” (shadow cabinet)ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పనితీరుపై షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఒడిశాలో బీజేడీ సుదీర్ఘకాలం పాలన చేసింది. మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాగా, పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కో శాఖను అప్పగించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్ పర్యవేక్షిస్తారు. మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు. షోడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును బీజేడీ జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇకపోతే.. నీవీన్‌ పట్నాయక్‌(Niveen Patnaik) ఏర్పాటు చేసిన ఈ షోడో క్యాబినెట్‌ ప్రభుత్వ అధికారిక సంస్థ కాదు. అలాగే ఈ క్యాబినెట్‌కు ఎలాంటి అధికారాలు ఉండవు. జూలై 22 నుండి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగనాన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గానికి అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. తద్వారా సీఎం మోహన్ మాఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్‌ పెట్టనున్నారు.

కాగా, ఈ షోడో క్యాబినెట్‌(shadow cabinet)లో ఎక్కువ మంది సీనియర్‌ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ప్రతి ఒక మంత్రికి ఒక షోడోను నియమిస్తారు. ఆ మంత్రులు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తారు. ఆ మంత్రి పనితీరు, అభివృద్ధి విధానాలను వారు అధ్యయనం చేస్తారు.

Read Also: Raj Tarun : ఫోన్ నంబర్ మార్చేసిన రాజ్ తరుణ్.. నాకు ఫోన్స్, కాల్స్ చేయొద్దు అంటూ..

 

 

Follow us