Site icon HashtagU Telugu

Shubhanshu- Balkrishanan: ఇస్రో- నాసా మిషన్.. అంత‌రిక్షంలోకి వెళ్లేది ఈ ఇద్ద‌రే..!

Shubhanshu- Balkrishanan

Shubhanshu- Balkrishanan

Shubhanshu- Balkrishanan: గత ఏడాది జూలైలో ఇస్రో తన కలల ప్రాజెక్టు చంద్రయాన్ 3ని ప్రారంభించింది. చంద్రయాన్ 3 అంతరిక్షంలో చరిత్ర సృష్టించడమే కాకుండా యావత్ దేశం గర్వించేలా చేసింది. ఆగస్ట్ 23, 2023న చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ భాగంలో దిగింది. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో నాల్గవ దేశంగా భారతదేశం అవతరించింది. సహజంగానే ఆగస్టు 23వ తేదీ చాలా ప్రత్యేకమైనది. భారతదేశం పేరు ప్రపంచమంతా మారుమోగింది. ఈ రోజును గుర్తుంచుకోవడానికి రేపు అంటే శుక్రవారం దేశంలో మొదటిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ఇస్రో- నాసా మిషన్

చంద్రయాన్ 3 విజయం తర్వాత ఇస్రో దృష్టి ఇప్పుడు దాని తదుపరి మిషన్‌పై ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఇద్దరు భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మిషన్ NISAR కింద గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ (Shubhanshu- Balkrishanan) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో శిక్షణ పొందుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మిషన్‌ను ప్రారంభించవచ్చు.

Also Read: Neuralink : మెదడులోకి చిప్.. ‘న్యూరాలింక్’ రెండో ప్రయోగం సక్సెస్

కెప్టెన్ శుభాంశు శుక్లా

ఇస్రో- నాసా మిషన్లలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రధాన వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నివాసి అయిన శుభాంశు శుక్లా 2006లో భారత వైమానిక దళంలో ఫైటర్ విభాగంలో నియమితులయ్యారు. IAFలో తన సేవలో శుభాంశు 2000 గంటలకు పైగా ప్రయాణించారు. సుఖోయ్ 30MKI, MiG-21, MiG-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, An-32 వంటి యుద్ధ విమానాలను నడిపారు. ఇస్రో కూడా గగన్‌యాన్ మిషన్ కోసం శుభాంశుని ఎంపిక చేసింది.

కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్

గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఇస్రో- నాసా మిషన్లలో కెప్టెన్ శుభాంశుతో పాటుగా ఎంపికయ్యారు. కేరళకు చెందిన కెప్టెన్ నాయర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో టాపర్‌గా నిలిచాడు. 1998లో భారత వైమానిక దళంలో భాగమైన నాయర్, సుఖోయ్ 30MKI, MiG-21, MiG-29, హాక్, డోర్నియర్, NN-32 వంటి యుద్ధ విమానాలను నడిపారు. అతనికి 3000 గంటల కంటే ఎక్కువ విమానయాన అనుభవం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.