Site icon HashtagU Telugu

Basketball Player Aakash Dhumal : దొంగగా మారిన జాతీయ ఛాంపియన్

Basketball Player Aakash Dh

Basketball Player Aakash Dh

మాములుగా సోమరిపోతులు..తాగుబోతులు ఎక్కువగా దొంగలుగా మారతారు. వారి విలాసాలు తీర్చుకోవడం కోసం దొంగతనాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ ఓ జాతీయ ఛాంపియన్ (National Level Basketball Player) దొంగగా మారడం క్రీడాకారులను షాక్ కు గురి చేస్తుంది. ఈ ఘటన ముంబై లో చోటుచేసుకుంది. జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఆకాష్ ధుమాల్‌ (Aakash Dhumal).. గోరేగావ్ వెస్ట్‌లో ఓ మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాగడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్ లో అతడ్ని విచారించగా.. ఆకాష్ ధుమాల్ స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడట. తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి పెరుగుతుండడం తో ఆ అప్పును తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌లు మొదలుపెట్టాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఆదివారం మరోసారి అలాంటి ఘటనే చేశాడు. మాంసం దుకాణం నుంచి 60 ఏళ్ల మహిళ బయటకు వస్తోంది. ఈ క్రమంలో మహిళను వెంబడించి ఇందిరా నగర్ ప్రాంతానికి వెళ్లి ఆమె మెడలోని గొలుసు లాగి పారిపోయాడు. నిందితులు లాగిన చైన్ విలువ సుమారు రూ.60 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలు పెర్సీ డిసౌజా పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఆకాష్ ధుమాల్ ఈ ఘటనకు పాల్పడ్డారని నిర్దారణ అయ్యింది. ధుమాల్ ఇంటిని చుట్టుముట్టామని, ఆ తర్వాత బయటకు రాగానే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

Read Also : PM Kisan KYC: పీఎం కిసాన్ eKYC ఇప్పుడు ఫోన్ ద్వారా చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?