Site icon HashtagU Telugu

NHB Recruitment : ఎంబీఏ పూర్తిచేసిన అభ్యర్ధులుకు గుడ్ న్యూస్, కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, జీతం రూ. 3.5లక్షలు

Nhb Recruitment

Nhb Recruitment

ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. (NHB Recruitment) నేషనల్ హౌజింగ్ బ్యాంక్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే డైరెక్టుగా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు బ్యాంకు అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.

నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 49 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో సీనియర్ ప్రాజెక్టు ఫైనాన్స్ ఆఫీసర్, ప్రాజెక్టు ఫైనాన్స్ ఆఫీసర్ వంటి పలు పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితోపాటు సంబంధిత విభాగాల్లో 5 నుంచి 15ఏళ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

పై పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్థుల విద్యార్హత, పని అనుభవం ఆధారంగా షార్ట్ లిస్టు చేయబడుతుంది. తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. 2.5 నుంచి రూ. 3.5 లక్షల వరకు జీత భత్యం చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు మే 13 చివరి తేదీ. పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైటును సందర్శించగలరు.