PM Modi Youtube Channel : ప్రధాని మోడీ యూట్యూబ్ ఆదాయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

PM Modi Youtube Channel : 2007లో ప్రారంభమైన ఈ యూట్యూబ్ ఛానల్‌లో ప్రధాని మోదీ చేపట్టే అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు

Published By: HashtagU Telugu Desk
Pm Modi Youtube Earn

Pm Modi Youtube Earn

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi ) రాజకీయ నాయకుడిగానే కాకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా నిలిచారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని ప్రధాన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనకు కోట్లల్లో ఫాలోవర్లు ఉన్నారు. అలాగే, ఆయనకు చెందిన అధికారిక యూట్యూబ్ ఛానల్ “నరేంద్ర మోదీ” (PM Modi Youtube Channel Earn)ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

Bollywood Stars Bodyguard: షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ బాడీగార్డులు నిజంగా కోట్లు సంపాదిస్తారా?

2007లో ప్రారంభమైన ఈ యూట్యూబ్ ఛానల్‌లో ప్రధాని మోదీ చేపట్టే అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, ఇంటర్వ్యూలు వంటి వీడియోలు ప్రసారం చేస్తారు. ఈ ఛానల్‌కు ప్రస్తుతం 26.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రపంచంలో 20 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు కలిగి ఉన్న ఏకైక రాజకీయ నాయకుడిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. ఈ ఛానల్ ప్రతినెలా రూ.1.62 కోట్ల నుంచి రూ. 4.88 కోట్ల మధ్య ఆదాయాన్ని పొందుతోంది. ఇప్పటి వరకు మొత్తం 29,272 వీడియోలను అప్‌లోడ్ చేసిన ఈ ఛానల్ 636 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వీడియోలు సగటున 40 వేల వ్యూస్ దాటుతున్నాయి, దీనివల్ల ఈ ఛానల్‌కు పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. ప్రధానమంత్రి మోడీ యూట్యూబ్ ఛానల్‌లో ప్రతివారం సగటున 19 వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. ఫాలోవర్ల సంఖ్య, వీడియో వ్యూస్, లైక్స్ ఇలా అన్ని విభాగాల్లో ఇది అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇక ఫేస్‌బుక్‌లో 48 మిలియన్ల ఫాలోవర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 82.7 మిలియన్ల ఫాలోవర్లు ఉండటంతో, మోదీ సోషల్ మీడియాలో తన ముద్ర వేశారు.

ప్రధాని మోడీ తర్వాత, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనార్ యూట్యూబ్ సబ్‌స్క్రైబర్ల పరంగా రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 6.4 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నా, మోదీ సబ్‌స్క్రైబర్లతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ.

  Last Updated: 11 Jan 2025, 03:36 PM IST