NDA Leader : ఎన్​డీఏ పక్షాల నేతగా మోడీ..

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పక్ష నేతగా ప్రధాని మోడీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

Published By: HashtagU Telugu Desk
Pm Modi Elect As Nda Leader

Pm Modi Elect As Nda Leader

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) పక్ష నేతగా ప్రధాని మోడీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధువారం ఢిల్లీ లోని ప్రధాని మోడీ (Modi) నివాసంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్​డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ విధానాల కారణంగా గత పదేళ్లలో దేశంలోని 140కోట్ల మంది ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు.

We’re now on WhatsApp. Click to Join.

మోడీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు టీడీపీ, జేడీ(యూ) లిఖిత పూర్వకంగా మద్దతు ఇచ్చాయి. దీంతో జూన్‌ 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎన్డీయే నేతలు కలువనున్నారు. జూన్‌ 8న మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు ఎన్డీయే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనున్నది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు , జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​, శివసేన నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే, ఎల్జేపీ నేత చిరాగ్ పాసవాన్​, ఎన్​సీపీ నేత ప్రఫుల్​ పటేల్​, జనసేన అధినేత పవన్ కల్యాణ్​ తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటె ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election Results) కూటమి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయం అందిన తెల్లారే చంద్రబాబు (Chandrababu) హస్తిన పర్యటనకు వెళ్లడం జరిగింది. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అంతేకాదు.. మోడీ (Narendra Modi) తన పక్కనే కూర్చొబెట్టుకుని మరీ ముచ్చటించారు. ‘చంద్రబాబు గారు మీరు మాట్లాడండి’ అని సమావేశంలో టీడీపీ అధినేతకు సమయం కూడా కేటాయించారు. దీంతో రెండు నిమిషాలపాటు ప్రధాని మోడీ గురించి, సమావేశం విషయాలను పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు టీడీపీ తన అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోస్ చూసిన టిడిపి శ్రేణులు తమ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు. చూశారుగా.. నాడు చంద్రబాబును ఎలా చూశారు..? నేడు ఎలా చూస్తున్నారో..? ఇదీ చంద్రబాబు, పసుపు దళపతి రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Lok Sabha Poll : దేశ వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థులు వీరే

  Last Updated: 05 Jun 2024, 08:43 PM IST