Site icon HashtagU Telugu

World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు నరేంద్ర మోడీ, ధోని కూడా!

PM Modi Interview

Pm Modi

World Cup Final: ఆదివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఐసిసి ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది.

2011లో, MS ధోని నేతృత్వంలోని భారతదేశం వాంఖడే స్టేడియంలో శ్రీలంకను ఓడించి రెండవ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు ఒక దశాబ్దం తర్వాత గుజరాత్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో మెన్ ఇన్ బ్లూ 3వ సారి ప్రపంచ ఛాంపియన్‌గా మారడానికి కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నారు.

ప్రముఖ అంతర్జాతీయ గాయని దువా లిపా కూడా టోర్నమెంట్ ముగింపు వేడుకలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రానుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు వరుసగా 10 విజయాలతో అజేయంగా ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా వరుస విజయాలతో ఊపు మీద ఉంది. కాగా 2023కి ముందు భారత్ మొత్తం 3 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో తొలిసారి టైటిల్‌ను గెలుచుకుంది. ఇక ధోనితో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు.

Exit mobile version