మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Maharashtra elections Results) కాంగ్రెస్ (Congress)ఘోర ఓటమి చవిచూడడంతో..దీనికి బాధ్యతగా మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత నానా పటోలే (Nana Patole) రాజీనామా (Resign చేసారని ఉదయం నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం నేపథ్యంలో.. ఆయన తన పదవికి రాజీనామా చేసారని, మహారాష్ట్ర ఎన్నికల్లో అధికారం ఖాయమని భావించిన మహావికాస్ అఘాడీ కూటమికి ఊహించనంత గట్టిదెబ్బ తగలడం, కాంగ్రెస్ , శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి 46స్థానాలకే పరిమితం కావడం, 101స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో మాత్రమే గెలవడంతో నానా పటోలే రాజీనామా చేసారని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాన్ని పటోలే ఖండించారు. రాజీనామా చేసినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని , తాను రాజీనామా చేయలేదని… మహా వికాస్ అఘాడీ చెక్కుచెదరకుండా ఉంటుందని తేల్చి చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నానా పటోలే 2021లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో.. నానా పటోలే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ.. మొత్తం 48 లోక్‌సభ సీట్లకు గానూ 17 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 13 స్థానాలను గెలుచుకుని అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో మహా వికాస్ ఆఘాడీ కూటమి ఈసారి ఎలాగైనా మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంతా భావించినా.. అది జరగలేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పిన అంచనాలను కూడా అందుకోవడంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి విఫలం అయ్యింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సకోలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నానా పటోలే కేవలం 208 ఓట్ల తేడాతో గెలుపొందారు.
Read Also : JEE 2025 : ముగిసిన జేఈఈ దరఖాస్తు గడువు.. 13.8 లక్షల అప్లికేషన్లు