PM Security: ఆదిత్య ఠాక్రే ను సీఎం ఉద్ధవ్ కారు నుంచి దిగిపొమ్మన్న మోడీ సెక్యూరిటీ..!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్రలోని ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానం ద్వారా ల్యాండ్ అయ్యారు.

  • Written By:
  • Publish Date - June 15, 2022 / 11:31 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహారాష్ట్రలోని ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానం ద్వారా ల్యాండ్ అయ్యారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేక కారులో వెళ్లారు.

ఈ కారులో సీఎం ఉద్ధవ్ తో పాటు ఆయన కుమారుడు, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా ఉన్నారు. కారులో నుంచి ఆదిత్య ఠాక్రే దిగారో.. లేదో.. ప్రధానమంత్రి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఆయనను అడ్డుకుంది. ప్రధానమంత్రికి స్వాగతం పలికే ప్రముఖుల జాబితాలో మీ పేరు లేదని ఆదిత్య ఠాక్రేకు చెప్పింది. ప్రధాని వెంట వెళ్లే కాన్వాయ్ లోనూ మీరు ఉండరాదని స్పష్టం చేసింది.

తన కొడుకును అడ్డుకున్న ఎస్పీజీ సిబ్బంది పై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారట. వారితో వాగ్వాదానికి దిగారట. “మీరెలా ఆదిత్యను అడ్డుకుంటారు. ఆయన నా కొడుకు మాత్రమే కాదు.. ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి. ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రికి స్వాగతం పలికే అర్హత ఆదిత్యకు కూడా ఉంది” అని ఎస్పీజీ సిబ్బందికి ఉద్ధవ్ క్లాస్ పీకారట. మొత్తం మీద ఉద్ధవ్ మాటే నెగ్గింది. ఎయిర్ పోర్టులో ప్రధానిని కలిసే అవకాశం ఆదిత్యకు దక్కింది. ప్రధాని వెంట కాన్వాయ్ లోనూ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది.