World Record : 3.25 లక్షల శానిటరీ ప్యాడ్ ల పంపిణీ.. నారీశక్తి ప్రపంచ రికార్డు

ప్రస్తుతం దేశంలోని బాలికలు, మహిళలు వాడుతున్న శానిటరీ ప్యాడ్ ల వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని.. సహజసిద్ధమైన ప్యాడ్ లను..

Published By: HashtagU Telugu Desk
world record with sanitary pads

world record with sanitary pads

World Record : శానిటరీ ప్యాడ్ ల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో గుజరాత్ లోని వడోదరనగరానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదియాడ్ పట్టణంలో నారీశక్తి వందన కార్యక్రమం నిర్వహించారు. నదియాడ్ లోని సంగత్ పార్టీ ప్లాట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల, కళాశాలల విద్యార్థినులకు 3.25 లక్షల శానిటరీ ప్యాడ్స్ ను పంపిణీ చేశారు. ఉత్తరసంద రోడ్డులోని సంగత్ పార్టీ ప్లాట్ లో నారీ శక్తివందన శానిటరీ ప్యాడ్ ల ప్రత్యేక ప్రదర్శన ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు.

ఈ సందర్భంగా శానిటరీ ప్యాడ్ ల దాత వీణాబెన్ పటేల్ మాట్లాడుతూ.. సమాజంలో శానిటరీ ప్యాడ్ లపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రస్తుతం దేశంలోని బాలికలు, మహిళలు వాడుతున్న శానిటరీ ప్యాడ్ ల వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని.. సహజసిద్ధమైన ప్యాడ్ లను వాడటంతో ఈ వ్యాధుల నుంచి తమని తాము కాపాడుకోవచ్చన్నారు.

నదియాడ్ నగరంలో సామాజిక సంస్థ అయిన జేసీఐ.. స్థానిక మహిళలు, బాలికల కోసం అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా జిల్లాలో, గ్రామాల్లో నివసించే మహిళలు నెలసరి సమయంలో వచ్చే సమస్యల నుంచి త్వరిత ఉపశమనం పొందేందుకు ఈ సంస్ధ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా నదియాడ్ లో జరిగిన నారీశక్తి కార్యక్రమంలో నదియాడ్ దిన్షా పటేల్ నర్సింగ్ కళాశాల, మహిళా ఆర్ట్స్ కళాశాల, టీజే పటేల్ కామర్స్ కళాశాల, సర్దార్ పటేల్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. వీరందరికీ 24గంటల్లో 3.25 లక్షల శానిటరీ ప్యాడ్ లను పంపిణీ చేసేందుకు జేసీఐ సంకల్పించిందని జైమిన్ భాయ్ తెలిపారు.

 

  Last Updated: 25 Oct 2023, 10:10 PM IST