చూడాల్సిందే.. తరించాల్సిందే..!

ఇండియా అంటేనే సంస్కృతీ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. విదేశీయులు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైన మనదేశాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన కట్టడాలు, అరుదైన ఆలయాలు, మదిని దోచే పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి కాబట్టే.. ఇండియాను విజిట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా నేటికీ అలనాటి కట్టడాలు ఆకట్టుకుంటూ రా రామ్మంటూ.. పిలుస్తున్నయ్. అంతేకాదు.. గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, జ్ఞాపకాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి కూడా. మనకు తెలియని అరుదైన ప్రదేశాలు, ఆలయాలు, వాటి విశిష్టతలు, రహస్యాల గురించి ‘హ్యాష్ ట్యాగ్ యూ’ స్పెషల్ స్టోరీ అందిస్తోంది మీకోసం..

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:25 PM IST

ఇండియా అంటేనే సంస్కృతీ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. విదేశీయులు సైతం తమ జీవితకాలంలో ఒక్కసారైన మనదేశాన్ని విజిట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ అద్భుతమైన కట్టడాలు, అరుదైన ఆలయాలు, మదిని దోచే పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి కాబట్టే.. ఇండియాను విజిట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా నేటికీ అలనాటి కట్టడాలు ఆకట్టుకుంటూ.. రా రామ్మంటూ.. పిలుస్తున్నయ్. అంతేకాదు.. గత చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు, జ్ఞాపకాలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి కూడా. మనకు తెలియని అరుదైన ప్రదేశాలు, ఆలయాలు, వాటి విశిష్టతలు, రహస్యాల గురించి ‘హ్యాష్ ట్యాగ్ యూ’ స్పెషల్ స్టోరీ అందిస్తోంది మీకోసం..

వేలాడే స్తంభం ఈ ఆలయం ప్రత్యేకత

ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం సిటీకి దగ్గరలో లేపాక్షి ఆలయం ఉంది. ఎంతో నైపుణ్యంగా శిల్పులు చెక్కిన గొప్ప ఆలయం ఇది. ఇక్కడి శిల్పాలను చూస్తూ అక్కడే ఉండాలనిస్తుంటుంది. ఈ ఆలయానికి ఒక్క ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. 70 స్తంభాలతో నిర్మించిన ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం ఏ ఆధారం లేకుండా.. నేలకు ఆనుకొని ఉండదు. గాలిలో వేలాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏదైనా ఒక్క బట్ట తీసుకొని స్థంబం కింద నుంచి ఒకవైపు నుంచి మరో వైపుకు తీయొచ్చు. అన్ని స్తంభాలు ఓ ఆధారం చేసుకొని ఉంటే, ఒక్క స్తంభం మాత్రం కిందా ఆధారం లేకుండా ఇక్కడి విశిష్టత. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇతర స్థంబాలకు ముప్పు ఏర్పడితే, ఈ స్థంభం మాత్రమే పడిపోకుండా కట్టడి చేస్తుందని అక్కడివాళ్లు చెప్తుంటారు. ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణ. ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఈ అద్భుతాన్ని చూసి వావ్ అని సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటుంటారు. ఇదొక్కటే కాదు.. ఇక్కడ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందినా ఆశ్యర్యపోనక్కర్లేదు.

ఒక్కవేలితో 70 కేజీల రాయిని ఎత్తుతారు!

సాధారణంగా మనిషి  పది కిలోలు బరువు ఉన్న రాయిని ఈజీగా లేపొచ్చు. కాస్తా బలంగా ఉన్నవాళ్లు అయితే 30 కేజీల బరువున్న రాయినైనా లేపుతారు. కానీ ఏకంగా 70 కేజీల బరువు ఉన్న రాయిని లేపాలంటే.. బాహూబలి సినిమాలో ప్రభాస్ అయినా ఉండాలి. వరల్డ్ వెయిట్ లిఫ్టర్ అయినా ఉండి తీరాలి. కానీ ఇక్కడ మాత్రమే సాధ్యమే అంటున్నారు కొందరు. 70 కేజీల బరువున్న రాయిని చేతితో కాకుండా.. ఒక్క వేలితోనే ఎత్తి చూపుతారు. కాకపోతే ఇక్కడ 11 మంది జట్టుగా ఏర్పడి రాయిని ఎత్తుతారు. ఇది ఎలా సాధ్యం అనే మీకు అనుమానం రావొచ్చు. భక్తి తో చేసే ఏ పని అయినా సాధ్యమవుతుందంటారు ఇక్కడి వాళ్లు.  పూణేలో అలీ దర్వేష్ దర్గా ఉంది. అక్కడ 70 కేజీల రాయిని లేపడం ప్రత్యేకత. రాయిని పదకొండు మంది ముట్టుకొని ఒకే వేలితో “హజరత్ కుమార్ అలీ దర్వేష్ ” అని పలుకుతూ రాయి ని పైకెత్తుతారు. ఇలా ఎలా సాధ్యమైందని అక్కడివాళ్లను ప్రశ్నిస్తే.. భక్తితో చేస్తే ఏదైనా సాధ్యమే అంటారు.

 

 

ఆ ఊర్లో ఏ ఇంటికీ తలుపులు ఉండవు..

సుమారు 400 సంవత్సరాల క్రితం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, పనాస్నాలా నది ఒడ్డున ఒక బెర్రీ చెట్టు కొమ్మల్లో నల్ల రాయి స్లాబ్ కొట్టుకుపోయింది. స్థానిక గొర్రెల కాపరి రాతి బండరాయిని గుండ్రని కడ్డీతో కప్పినప్పుడు… రాయి నుంచి రక్తం వచ్చిందట. అదేరోజు రోజు రాత్రి గొర్రెల కాపరి కలలోకి దేవుడు ప్రత్యక్షమయ్యాడట. నల్ల రాయి స్లాబ్ విగ్రహమని, వెంటనే గుడిని కట్టాలని చెప్పాడట. తన విగ్రహంపై పైకప్పు నిర్మించాల్సిన అవసరం లేదని, తద్వారా గ్రామంపై ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటానని అభయం ఇచ్చాడట. ఇక అప్పట్నుంచీ ఆ గ్రామంలో ఏ ఇంటికీ తలుపుల ఉండవట. ఇప్పటికి అదే సంప్రదాయాన్ని ఆ గ్రామస్తులు కొనసాగిస్తుండటం విశేషం.

వెహికల్స్ ఎటుపోతున్నాయో అర్థంకావు

లడఖ్ లోని మాగ్నెటిక్ హిల్స్ గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా పనిచేస్తాయట. అక్కడి రోడ్లపై ఏదైనా వాహనాన్ని పార్క్ చేసి ఉంచితే అవి వాటంతట అవే వాలుకు అనుగుణంగా రోడ్డుపై ముందుకు కదులుతాయట. వాహనాన్ని నడపాల్సిన పని లేదట. అవే ముందుకు సాగుతాయట. అయితే అక్కడి పర్వతాలు, లోయల కారణంగా వాహనంలో ప్రయాణించే వారికి పైకి వెళ్తున్నారో, కిందకి వెళ్తున్నారో అర్థం కాదట.

ఆ సముద్రంలో రాళ్లు తేలుతాయ్

తమిళనాడు, రామేశ్వరంలోని రామసేతు వద్ద సముద్రంపై రాళ్లను వేస్తే అవి నీటిలో తేలుతాయట. అయితే ఒకప్పుడు అక్కడ రాళ్లు మునిగిపోయేవట. కానీ లంకను చేరేందుకు రాముడు వానర సైన్యంతో సముద్రంపై రామసేతు నిర్మాణం చేపట్టిన సమయంలో వానరులంతా రాళ్లపై శ్రీరామ అని రాశారట. అందుకే ఆ రాళ్లు అప్పటి నుంచి మునిగిపోవడం లేదట. అయితే దీనికి సైంటిస్టులు వేరే కారణాలు చెబుతున్నారు. రామసేతు వద్ద ఉన్న రాళ్లు ప్యూమిస్ జాతికి చెందినవని, వాటిలో గాలితో కూడిన బబుల్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయని, అందుకే ఆ రాళ్లు నీటిలో తేలుతాయని చెప్పుకొచ్చారు. కానీ అక్కడే ఉన్న ప్యూమిస్ జాతికి చెందని మరికొన్ని రాళ్లు కూడా ఆశ్చర్యంగా సముద్రపు నీటిపై తేలుతున్నాయట. అయితే వీటి గురించి మాత్రం సైంటిస్టులు ఏమీ నిరూపించలేకపోయారట.

 

ఆ చర్చి నీటిలో మునిగినా.. కనువిందు చేస్తోంది

బెంగళూరుకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో హసన్ పట్నానికి దగ్గరగా ఉన్న ఓ గ్రామం పేరు శెట్టిహళ్లి. ఈ గ్రామానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అటు ఫ్రెంచివాళ్లు, ఇటు బ్రిటిష్ వాళ్లు ఇక్కడ నివసించిన ఆనవాళ్లు ఉన్నాయి. 1860లో ఆ చర్చిని భారీగా పునర్నిర్మించారు. శెట్టిహళ్లి గ్రామస్తులతో పాటుగా దూరదూరాల నుంచి భక్తులను ఆకర్షించేంత అద్భుతంగా ఆ చర్చిని నిర్మించారు. 1960 ప్రాంతంలో శెట్టిహళ్లి గ్రామానికి సమీపంలోని హేమవతి నది మీద రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రిజర్వాయర్ కనుక నిర్మిస్తే శెట్టిహళ్లి గ్రామం మునిగిపోతుందని తేలింది. ఇక తప్పనిసరి పరిస్థితులలో అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 1979లో రిజర్వాయర్ పూర్తికావడంతో… శెట్టిహళ్లి నీటిలో మునిగిపోయింది. దాంతోపాటుగానే అక్కడి చర్చి కూడా మునిగిపోయింది. అయినా ఇప్పటికీ టూరిస్టులకు కనువిందు చేస్తోంది.

సంగీతం వినిపించే హంపి

హంపీలోని వితల దేవాలయ సంగీత స్తంభాలు అడుగులతో నొక్కినప్పుడు మధురమైన సంగీతాన్ని వినిపిస్తాయి. గట్టిగా ఉండే రాతి స్తంభాలు చేతులతో తాకినప్పుడు బయటకు వినిపించేలా శబ్దాన్ని చేస్తాయి. ఈ శబ్దాలు వింటే ఓ మ్యూజిక్ డైరెక్టర్ సరిగమలను ప్లే చేసినా అనుభూతినిస్తాయి. ఆశ్చర్యం గా ఈ స్తంభాలు ఒక గట్టి రాయితో చేశారు. అయినా సంగీతాన్ని అందించడం దీని ప్రత్యేకత. అయితే ఒక్కో స్థంబాన్ని కూడా ఒక్కో కొలత ఉపయోగించి,  ఒక్కో సంగీత శబ్దం వచ్చేలా చెక్కడం జరిగింది. టూరిస్టులు ఎవరైనా హంపీ వీటిని విజిట్ చేసి ఆ సంగీత మాధుర్యాన్ని అనుభవిస్తారు.

వామ్మో.. ఎంత పెద్ద మర్రిచెట్టో..

కలకత్తాకు దగ్గరలో ఉన్న హౌరాలో ఆచార్య జగదీష్ చంద్ర బోస్ భారత బోటానిక్ గార్డెన్ ప్రపంచంలోనే చాలా ఫేమస్. ఈ గార్డెన్ అతిపెద్ద మరిచెట్టు ఉండటం విశేషం. ఈ చెట్టు  వయస్సు 200 నుంచి 250 ఏండ్లు ఉంటుందట. 1925లో పిడుగు పడటంతో చెట్టులోని  కొంత భాగం దెబ్బతినటంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఈ చెట్టు కింద నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి ఈ చెట్టు చుట్టూ 330 మీటర్ల పొడవున్న రహదారి నిర్మించారు. అయితే ఈ చెట్టు ఈ దారిని దాటి వ్యాప్తి చెందుతుంది.  ఈ చెట్టు కాయలు తినరు ఎందుకంటే రుచిగా ఉండవట. ఈ కాయలు పక్వానికి వచ్చినపుడు ఎరుపు రంగులో మారి ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తాయి.