DRC Mall: మైసూరులోని జయలక్ష్మీపురం ప్రాంతంలోని డీఆర్సీ షాపింగ్ మాల్‌లో సోమవారం (సెప్టెంబర్ 8, 2025) సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. మాల్ నాలుగో అంతస్తు నుంచి జారిపడటంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. పోలీసుల సమాచారం ప్రకారం, మృతుల్లో ఒకరు సునీల్ (28), ఎలక్ట్రిషియన్‌గా మాల్‌లో పని చేస్తున్నారు. పనిలో ఉండగా ఆయన అజాగ్రత్తగా నాలుగో అంతస్తు నుంచి కింద పడిపోయారు. ఈ దృశ్యం చూసిన మరో యువకుడు చంద్రు (22) వెంటనే సహాయం చేయడానికి పరుగెత్తి వెళ్లి ప్రయత్నించగా, అతడూ ప్రమాదవశాత్తు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు.
Kerala : కేరళలో అమీబిక్ మెనింగోఎన్సెఫలిటిస్ కలకలం.. నెల రోజుల్లో ఐదుగురి మృతి
సునీల్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన చంద్రు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ ఘోర సంఘటనతో మాల్‌లో పనిచేస్తున్న సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జయలక్ష్మీపురం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన మాల్‌లో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తగా, స్థానికులు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
GHMC : అల్లు ఫ్యామిలీకి మరో షాక్… జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు..!