Mytra : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ షాపింగ్ ఒక విప్లవంలా మారింది. రోజువారీ అవసరాల నుంచి లగ్జరీ ప్రొడక్ట్స్ వరకు ప్రతి చిన్న వస్తువూ ఇంట్లో కూర్చొని సులభంగా ఆర్డర్ చేసే స్థాయికి ప్రజల వినియోగ పద్ధతులు మారిపోయాయి. ఈ మార్పును క్యాష్ చేసుకునేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా, స్నాప్‌డీల్ వంటి అనేక ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ ఇప్పటికే వినియోగదారుల ముందుకు వచ్చాయి. వీటిలో బట్టలు, ఫ్యాషన్ యాక్సెసరీస్ రంగంలో మింత్రా ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది.
ఫ్యాషన్ రంగంలో దూసుకుపోతున్న మింత్రాపై తాజాగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది. ఫెమా (FEMA – Foreign Exchange Management Act) చట్టం ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. రూ.1,654.35 కోట్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో మింత్రా, దాని అనుబంధ సంస్థలు, డైరెక్టర్లపై బెంగళూరు జోనల్ కార్యాలయం కేసు నమోదు చేసింది.
ఈడీ ప్రకారం, మింత్రా హోల్‌సేల్ ట్రేడింగ్ మోడల్ కింద పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూనే నిబంధనలను అతిక్రమించి రిటైల్ వ్యాపారంలో పాల్గొంటోంది. ఫెమా నిబంధనల ప్రకారం, హోల్‌సేల్ వ్యాపారం చేసే సంస్థలు తమ ఉత్పత్తులలో గరిష్టంగా 25% మాత్రమే తమ అనుబంధ సంస్థలకు అమ్మాలి. కానీ మింత్రా మాత్రం తన ఉత్పత్తుల 100% ను తనకే చెందిన వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి విక్రయించింది. ఆ తర్వాత వెక్టర్ ఆ వస్తువులను నేరుగా కస్టమర్లకు అమ్మింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఈడీ అభిప్రాయపడుతోంది.
మింత్రా రూ.1,654.35 కోట్ల విలువైన ఎఫ్‌డీఐని హోల్‌సేల్ వ్యాపారం నిర్వహించేందుకు పొందింది. కానీ ఆ డబ్బును రిటైల్ అమ్మకాల కోసం వాడినట్లు ఈడీ దర్యాప్తులో తేలిందని అధికారులు చెబుతున్నారు. నిజానికి హోల్‌సేల్ మోడల్ అనగా, కస్టమర్లకు నేరుగా అమ్మకాలు జరపకూడదు, రిటైలర్లకు లేదా ఇతర వ్యాపారులకు సరఫరా చేయాలి. కానీ వెక్టర్ అనే అనుబంధ సంస్థను వాడుకుని మింత్రా నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులను అందించడం ఫెమా చట్టం ప్రకారం తప్పు అని ఆరోపణలు ఉన్నాయి.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా బెంగళూరు జోనల్ కార్యాలయం ఈ కేసును నమోదు చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. మింత్రా, దాని అనుబంధ సంస్థల లావాదేవీలను సమగ్రంగా పరిశీలించగా అనేక లోపాలు బయటపడ్డాయని అధికారులు చెబుతున్నారు. మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన హోల్‌సేల్ వ్యాపారాన్ని కేవలం పేరు కోసం ఉంచి, వాస్తవానికి రిటైల్ ట్రేడింగ్ ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తోందని ఈడీ తేల్చింది.
ప్రస్తుతం ఈ కేసుపై మింత్రా ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కేసు మింత్రా ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మింత్రా , దాని పేరెంట్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ గతంలో కూడా ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నాయి. ఇప్పుడు ఫెమా ఉల్లంఘనల కేసు పెద్ద స్థాయిలో మినహాయింపులు లేకుండా దర్యాప్తు జరగబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ కామర్స్ రంగంలో మింత్రా పెద్ద బ్రాండ్‌గా నిలిచింది. ఫ్యాషన్ విభాగంలో ఎక్కువ మార్కెట్ షేర్ కలిగిన మింత్రా, ఈడీ కేసు నేపథ్యంలో భవిష్యత్తులో కొన్ని నియంత్రణ సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఈ కేసు ఫలితంపై ఆధారపడి కంపెనీ వ్యాపార విధానాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉండొచ్చు.
Rahul Gandhi : ట్రంప్ కాల్పుల విరమణ చేయించారని కేంద్రం చెబుతుందా..?