Ustad Rashid Khan: శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ మృతి

క్యాన్సర్‌తో పోరాడుతున్న హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు

Published By: HashtagU Telugu Desk
Ustad Rashid Khan

Ustad Rashid Khan

Ustad Rashid Khan: క్యాన్సర్‌తో పోరాడుతున్న హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ మంగళవారం మధ్యాహ్నం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉస్తాద్ రషీద్ ఖాన్ సంతాపం ప్రకటించారు. కేవలం 55 సంవత్సరాల వయస్సులో మరణించడం బాధాకరం. ఉస్తాద్ రషీద్ ఖాన్ మరణం దేశానికి మరియు మనందరికీ తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. అతను నాకు సోదరుడిలాంటివాడు. అతను నన్ను అమ్మ అని పిలిచేవాడు అని బెనర్జీ ఆసుపత్రిలో విలేకరులతో అన్నారు.

ఉస్తాద్ రషీద్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని బదయున్‌లో జన్మించాడు ఖాన్ గత ఏడాది నవంబర్ 22న అనారోగ్యం కారణంగా కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. న్యూరోసర్జన్ల బృందం అతన్ని సంప్రదాయ చికిత్సకు నిర్ణయించుకుంది. తొలుత బాగానే కోలుకున్నాడని కానీ ఇన్ని రోజులు ఆసుపత్రిలో ఉన్నందున అతనికి ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ ఏర్పడింది. దీంతో అది వేగంగా వ్యాపించింది. కాగా ఈ రోజు ఉదయం అతన్ని వెంటిలేటర్‌పై ఉంచారు. వైద్యలు శాయశక్తులా ప్రయత్నించామని కానీ అతనిని బ్రతికించలేకపోయామని సీనియర్ ఆసుపత్రి వైద్యుడు చెప్పారు.

ఉస్తాద్ ఖాన్‌ మధ్యాహ్నం 3:45 గంటలకు ఆయన మరణించారు.ఉస్తాద్ ఖాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉస్తాద్ రషీద్ ఖాన్ మా అత్యున్నత పౌర పురస్కారం బంగా బిభూషణ్ మరియు మా సంగీత మహాసమ్మన్ కూడా పొందారు. 2006లో పద్మశ్రీ మరియు 2022లో పద్మభూషణ్‌ను కూడా పొందారు.

Also Read: Ram Mandir: అయోధ్యలో జనవరి 22 న అవి తెరుచుకోవు

  Last Updated: 09 Jan 2024, 07:50 PM IST