33 Years Prison : దంపతులకు 33ఏళ్ల జైలు.. ఎన్ని దారుణాలు చేశారంటే..

33 Years Prison : డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దోషులుగా తేలిన భారత సంతతికి చెందిన దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

  • Written By:
  • Updated On - January 31, 2024 / 03:45 PM IST

33 Years Prison : డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దోషులుగా తేలిన భారత సంతతికి చెందిన దంపతులకు బ్రిటన్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెస్ట్ లండన్‌లోని ఈలింగ్‌ ప్రాంతంలో నివసిస్తున్న  ఆర్తి ధీర్, కవల్ జిల్‌సిన్హ్ రైజాడాలు(33 Years Prison)  కొంత కాలంగా డ్రగ్స్ స్మగ్లింగ్ దందా చేస్తున్నారు. 2019 నుంచి ఆస్ట్రేలియాకు కూడా డ్రగ్స్‌ను సప్లై చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరినీ 2021లోనే బ్రిటన్‌లోని హాన్‌వెల్ నగరంలో అరెస్టు చేశారు. అయితే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు సరైన ఆధారాలు దొరకకపోవడంతో పోలీసులు విడిచిపెట్టారు. అయితే విచారణ నిమిత్తం వారిని 2023లో మరోసారి అరెస్టు చేశారు. దీనిపై అప్పటినుంచి కోర్టులో విచారణ జరుగుతుండగా..తాజాగా వారు దోషులుగా తేలారు. దీంతో కోర్టు శిక్ష విధించింది.  2021లో అరెస్టు టైంలో పోలీసులు ఆర్తి ధీర్, కవల్ జిల్‌సిన్హ్ రైజాడా దంపతుల ఇంట్లో రూ.5.26 లక్షల విలువైన బంగారు, వెండి బిస్కెట్లు, సుమారు రూ.77లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై అప్పట్లో మనీలాండరింగ్ అభియోగాలను సైతం నమోదు చేశారు. దంపతులిద్దరూ విమాన సర్వీసు ఏజెన్సీలో పని చేశారని, ఆ అవగాహనతోనే సులువుగా స్మగ్లింగ్ చేసేవారని అధికారులు చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

ఇండియాలో ఇంత దారుణం చేసి.. 

ఇక ఈ దంపతులు ఇండియా నుంచి బ్రిటన్‌కు వెళ్లక ముందు 2015లో ఓ బాలుడిని దత్తత తీసుకున్నారు. 2017లో ఆ బాలుడిని దారుణంగా మర్డర్ చేశారు. అయితే ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఆ బిడ్డను దత్తత తీసుకున్నారని ఆపై కిడ్నాప్ చేసి చంపారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో వారిద్దరినీ తమకు అప్పగించాలని బ్రిటన్‌ను భారత్ కోరగా..అందుకు బ్రిటన్ ప్రభుత్వం తిరస్కరించింది.

Also Read :300 Luxury Cars : 47వేల కోట్ల ఆస్తి.. 300 లగ్జరీ కార్‌లు.. కొత్త రాజు ప్రాపర్టీస్ చిట్టా

తోషాఖానా కేసులో ఇమ్రాన్‌‌కు 14 ఏళ్ల జైలు 

తోషాఖానా కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష పడింది. ఇమ్రాన్‌తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.  దేశానికి సంబంధించిన అధికారిక రహస్యపత్రాల దుర్వినియోగం కేసు (సైఫర్‌‌ కేసు)లో ఇమ్రాన్ కు పదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే.  ఆ మరుసటి రోజే  పాకిస్థాన్ కోర్టు ఈ తీర్పును ప్రకటించింది.  అంతేకాకుండా మరో పదేళ్ల పాటు  ఎన్నికల్లో పోటీ చేయకుండా అన‌ర్హత వేటు కూడా విధించింది. ఆ జంట సుమారు రూ.150 కోట్లు జ‌రిమానా క‌ట్టాల‌ని కోర్టు ఆదేశించింది.  ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉన్న సమయంలో విదేశాల నుంచి 58 ఖరీదైన కానుకలు  అందుకున్నారు.  వాస్తవానికి అయితే వాటిని తోషాఖానాలో జమ చేయాలి.

తోషాఖానా అంటే..

తోషాఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ  కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తుంది. రాజకీయ నేతలకు, అధికారులకు వచ్చే బహుమతులను ఇందులో ఉంచుతారు. అయితే బహుమతుల విలువ రూ. 30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి దానిని తన వద్ద ఉంచుకోవచ్చు.  అంతకంటే  ఎక్కువ ఖరీదు అయితే  చట్టం ప్రకారం తోషాఖానాలో ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ పీఎంగా ఉన్న టైమ్ లో  ఖరీదైన బహుమతులను తోషాఖానాకు అప్పగించకుండా రూ.38 లక్షల రోలెక్స్‌ గడియారాన్ని కేవలం రూ.7.54 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అదే విధంగా రూ.15 లక్షలు విలువ చేసే మరో రోలెక్స్‌ గడియారాన్ని రూ.2.94 లక్షలు మాత్రమే చెల్లించి తీసుకున్నారు. ఇలా మూడోవంతు కంటే తక్కువగా కట్టి , ఆ తర్వాత వాటిని దుబాయిలో అమ్ముకున్నారని పాక్​ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్ ఆరోపించారు. ఇలా వచ్చిన ఆదాయం వివరాల్ని ఇమ్రాన్ ఖాన్ ఇన్​కమ్ ట్యాక్స్​ రిటర్నుల్లో చూపలేదు.