Threat To Shinde: మహారాష్ట్రలో రాజకీయంగా ఏదో జరుగుతోంది. అధికార మహాయుతి కూటమిలో ఉన్న ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన ఎమ్మెల్యేలకు ఇటీవలే సెక్యూరిటీ కవర్‌ను తగ్గించారు. దీనిపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు పెదవి విరిచారు. ఉద్దేశపూర్వకంగానే షిండే వర్గం శివసేనను చిన్నబుచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈనేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేకు(Threat To Shinde) హత్య బెదిరింపులు వచ్చాయి. ఆయన ఉపయోగించే వాహనాన్ని బాంబుతో పేల్చేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు వార్నింగ్ ఇచ్చారు.
Also Read :BRS Vs BJP : బీజేపీపై మౌనమేలనోయి.. కేసీఆర్, కేటీఆర్, కవిత ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?
బెదిరింపు మెయిల్ బూటకం
గురువారం మధ్యాహ్నం ముంబైలోని గోరెగావ్ పోలీసులకు ఈ మెయిల్ ద్వారా ఈ బెదిరింపు సందేశాన్ని దుండగులు పంపారు. మహారాష్ట్ర సచివాలయం, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్‌కు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్సే అందాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. షిండేకు వచ్చిన బెదిరింపు మెయిల్ బూటకమని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ మెయిల్ పంపిన వారిని గుర్తించి, పట్టుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read :Google Pay: గూగుల్ పేలో బిల్ పేమెంట్స్ చేస్తున్నారా? బ్యాడ్ న్యూస్
ఆనాడు కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ..
2022 సంవత్సరంలో ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ నుంచి ఏక్‌నాథ్ షిండే విడిపోయారు. దీంతో ఆనాటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ టైంలో షిండే వర్గంలోకి జంప్ అయిన థాక్రే వర్గం శివసేన ఎమ్మెల్యేలకు భారీ భద్రతను కల్పించారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఏక్‌నాథ్ షిండేకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించి, ఫిరాయింపులను ప్రోత్సహించింది. దీంతో మహారాష్ట్రలో అకస్మాత్తుగా మహాయుతి సర్కారు ఏర్పడింది. ఈసారి జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. దీంతో సీఎం సీటును ఏక్‌నాథ్ షిండేకు ఇచ్చేందుకు బీజేపీ నో చెప్పింది. కమలదళం అగ్రనేత దేవేంద్ర ఫడ్నవిస్‌కు మహారాష్ట్ర సీఎం సీటును అప్పగించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు. ఈ పరిణామంతో షాక్ అయిన షిండే కొన్ని రోజుల పాటు అలకబూనారు. చివరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రంగంలోకి దిగడంతో, డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకునేందుకు ఏక్‌నాథ్ షిండే సిద్ధపడ్డారు. అయినా లోలోపల ఆయనను పరాభవ భావం వెంటాడుతోంది. భవిష్యత్తులో రాజకీయ సందర్భాన్ని బట్టి అది బయటపడే అవకాశం ఉంది.