Mumbai : న‌కిలీ పాస్‌పోర్ట్‌, వీసా రాకెట్ ముఠా గుట్టుర‌ట్టు చేసిన ముంబై పోలీసులు

ముంబైలో న‌కిలీ పాస్‌పోర్ట్‌, వీసా రాకెట్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ముంబైలోని అంధేరీ ఈస్ట్ నుండి నకిలీ వీసా,

  • Written By:
  • Publish Date - January 26, 2023 / 07:31 AM IST

ముంబైలో న‌కిలీ పాస్‌పోర్ట్‌, వీసా రాకెట్ కేంద్రాన్ని పోలీసులు గుర్తించారు. ముంబైలోని అంధేరీ ఈస్ట్ నుండి నకిలీ వీసా, అంతర్జాతీయ పాస్‌పోర్ట్ రాకెట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీస్ క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. విచారణలో పోలీసులు నకిలీ స్టాంపులు, నకిలీ వీసాలు, బోగస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ దేశాల ప్రింటింగ్ మెషీన్లు, స్కానర్లు, బహుళ ఇమ్మిగ్రేషన్ స్టాంపులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల్ని మోసం చేసి నకిలీ పత్రాలను అందించి, విదేశాలకు వెళ్లిన తర్వాత సంబంధిత దేశ ఇమ్మిగ్రేషన్ విభాగం ఢిల్లీకి రప్పించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

విచారణలో బాధితుడు తనకు పాస్‌పోర్టు, వీసా ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నాడో పోలీసులకు సమాచారం అందించాడు. అరెస్టు చేసిన ఇద్దరు నిందితులను ఇంతియాజ్ షేక్ (62), సుధీర్ సావంత్ (32)గా పోలీసులు గుర్తించారు.వీరిని ఫిబ్రవరి 4వ తేదీ వరకు పోలీసు కస్టడీకి తరలించారు. ముంబయి క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రశాంత్ కదమ్ మాట్లాడుతూ.. ఇద్దరు నిందితులు నేర నేపథ్యం ఉన్నవారని.. న్యూఢిల్లీలో ఇంత‌కు ముందు ఒక స్కామ్‌లో అరెస్ట్ అయ్యార‌ని తెలిపారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారని తెలిపారు. ఈ రాకెట్‌ను వీరిద్ద‌రు నడపడానికి ముంబై వచ్చార‌ని తెలిపారు.. ఎంత మందికి నకిలీ పత్రాలు ఇచ్చారో త‌మ‌కు ఇంకా తెలియ‌రాలేద‌ని.. దానిపై విచార‌ణ చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.