Site icon HashtagU Telugu

Mumbai:రైల్ వ్యూ భవనంలో భారీ అగ్నిప్రమాదం..ఫ్లాట్ల బాల్కనీలలో వేలాడుతూ రక్షించమంటూ వేడుకోలు..!!

Mumbai

Mumbai

ముంబై తిలక్ నగర్ లోని రైల్ వ్యూ భవనంలో శనివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లాట్లలో ఉన్న చాలామంది ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం వెలుపల ఉన్న ఫ్లాట్ల బాల్కనీలలో వేలాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. బాల్కనీలో వేలాడుతూ ప్రజలు తమను రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 10కి పైగా వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్య్కూ ఆపరేషన్ నిర్వహించారు. 12వ అంతస్తులో ఉన్న ఎంఐజీ సొసైటీ ఫ్లాట్ లో మంటలు చెలరేగాయి.