Site icon HashtagU Telugu

Local Train Accident : ముగ్గురు రైల్వే సిబ్బందిపైకి దూసుకెళ్లిన రైలు.. ఏమైందంటే ?

Local Train Accident Min

Local Train Accident Min

Local Train Accident : రైల్వే ట్రాక్‌పై వర్క్ చేస్తున్న ముగ్గురు రైల్వే ఉద్యోగుల పైనుంచి లోకల్ ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ దారుణ ప్రమాదం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయ్ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చనిపోయిన ముగ్గురిని పశ్చిమ రైల్వేకు చెందిన సిగ్నలింగ్ విభాగం  ఉద్యోగులు చీఫ్ సిగ్నలింగ్ ఇన్‌స్పెక్టర్  వాసు మిత్ర, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్ మెయింటెనర్ సోమనాథ్ ఉత్తమ్ లంబుత్రే, హెల్పర్ సచిన్ వాంఖడేగా గుర్తించారు. వీరు వసాయ్ రోడ్ – నైగావ్ స్టేషన్‌ల మధ్య రైల్వే ట్రాక్‌పై సిగ్నలింగ్ కేబుల్ నెట్‌వర్క్‌కు రిపేరింగ్ చేస్తుండగా.. అటువైపుగా లోకల్ రైలు దూసుకెళ్లింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఆలస్యంగా ఇప్పుడు బయటికి వచ్చాయి. వీరంతా పశ్చిమ రైల్వే ముంబై డివిజన్‌లోని సిగ్నలింగ్ విభాగంలో పనిచేసేవారు. ఈ ఘటనపై విచారణకు రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించారు. పశ్చిమ రైల్వే అధికారులు ముగ్గురు మృతుల((Local Train Accident) కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.55,000 చొప్పున పరిహారాన్ని చెల్లించారు.

We’re now on WhatsApp. Click to Join.

1912 జూన్ 1.. పంజాబ్ మెయిల్ రైలు.. తెలుసా ?

దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న అతి పురాతన రైళ్లలో ఒకటిగా పేరుపడ్డ పంజాబ్ మెయిల్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 1912 జూన్ 1న పంజాబ్ మెయిల్ రైలు సర్వీసు ప్రారంభమైంది. అప్పట్లో దీన్ని పంజాబ్ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఇది ముంబై, పాక్‌లోని పెషావర్ మధ్య రాకపోకలు సాగించేది. స్వాతంత్ర్యానంతరం రైలు రూట్‌లో మార్పులు జరిగాయి. గత 113 ఏళ్లు రాకపోకలు సాగిస్తున్న ఈ రైలు ప్రస్తుతం ముంబై, ఫిరోజ్‌పూర్ (పంజాబ్) మధ్య పరుగులు తీస్తోంది. తొలుత ఆరు బోగీలే ఉన్న ఈ రైల్లో ఇప్పుడు ఏకంగా 24 కోచ్‌లు ఉన్నాయి. ముంబై నుంచి రాత్రి 7.35 గంటలకు బయలుదేరే ఈ రైలు సుమారు 34 గంటల్లో 1930 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఫిరోజ్‌పూర్ చేరుకుంటుంది.

1945లో తొలిసారిగా ఏసీ కోచ్‌లు

బ్రిటీష్ అధికారులు, వారి కుటుంబాల తరలింపు కోసం తొలుత పంజాబ్ మెయిల్‌ను నిర్వహించేవారు. అప్పట్లో ఇది ముంబై నుంచి ఢిల్లీ వెళ్లి అటుపై నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్‌లోని తన గమ్యస్థానానికి వెళ్లేది. 1914లో రైలు ముంబైలోని విక్టోరియా టెర్మినెస్ (నేటి ఛత్రపతి శివాజీ టర్మినస్) నుంచి ప్రయాణాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ రైలు ఎలక్ట్రిక్ ఇంజిన్‌ సాయంతో పరుగులు పెడుతోంది. మొదట్లో మాత్రం స్టీమ్ ఇంజిన్ ఉండేది. బాంబే నుంచి ఇటార్సీ, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, ఢిల్లీ, అమృత్‌సర్ మీదుగా లాహోర్ వరకూ మొత్తం 2496 కిలోమీటర్ల మేర ప్రయాణించేది. 1945లో తొలిసారిగా ఈ రైల్లో ఏసీ కోచ్‌లు కూడా జోడించారు. 2012లో ఈ సర్వీసు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈ రైలు నమూనాను ప్రదర్శించారు.

Also Read :Congress Workers Clash : రాహుల్ యాత్రలో ఉద్రిక్తత.. బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ క్యాడర్ ఏం చేసిందంటే..