Site icon HashtagU Telugu

High Court Order : చదువుకున్న ప్రతి మహిళా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదు..!!

Mumbai High Court

Images 1541162067162 Mumbai High Court

ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ పనిచేస్తేనే పూటగడుస్తుంది. అందుకే భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తున్నారు. .పిల్లల భవిష్యత్ కోసం కష్టపడి పని చేస్తూ సంపాదిస్తున్నారు. చదువుకున్న ప్రతీ మహిళ ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని ఈ మధ్యకాలంలో ఒత్తిడి బాగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే ముంబై హైకోర్టు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదువుకున్న ప్రతీ మహిళా ఖచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన లేదని వ్యాఖ్యానించింది. కేవలం ఒక మహిళా ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు కలిగి ఉందన్న కారణంగా ఆమె ఉద్యోగం చేయాలని…ఇంట్లో ఉండకూడదని అర్థం కాదని జస్టిస్ భారతి డాంగ్రే తెలిపారు.

ఉద్యోగం చేయడం అనేది మహిళల ఇష్టంపైన్నే ఆధారపడి ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన ఇంటి దగ్గర కూర్చోవడానికి వీలులేదనే వాదన సరైందికాదన్నారు. స్థిరమైన ఆదాయాన్ని పొందుతోన్న ఓ భార్య తన భర్త నుంచి భరణం కోరిందన్న కేసు విచారణలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ భారతి. 2010లో ఓ జంట పెళ్లి చేసుకుంది. 2013 నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. కూతురు తల్లితో ఉంటోంది. ఈ క్రమంలో తనకు భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలని సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. కుటుంబ న్యాయస్థానంలో తనతోపాటు..తనకూతురు జీవనానికి సరిపడే డబ్బు భర్త నుంచి అందించాలని పిటిషన్ దాఖలు చేసింది. దీంతో కోర్టు భార్యకు నెలకు రూ. 5వేలు చిన్నారి పోషణ కోసం రూ.7వేలు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే భర్త…తన భార్య ఉద్యోగం చేస్తోందని..తనకు ఆదాయం మార్గం లేదని తప్పుడు సమాచారంతో పిటిషన్ దాఖలు చేసిందని సవాలుగా మరో పిటిషన్ దాఖలు చేశాడు.

ఈనేపథ్యంలో శుక్రవారం విచారణకు వచ్చిన ఈ కేసు…జస్టిస్ భారతి డాంగ్రే ఈ వ్యాఖ్యలు చేశారు. పనిచేయాలా వద్దా అనేది మహిళా హక్కు…ఆమె గ్రాడ్యుయేట్ అయితే…పనిచేకూడదనే నిబంధన ఏమందంటూ ప్రశ్నించారు. తనను తాను ఉదాహరణాగా ప్రస్తావించారు. ఈ రోజు నేను జడ్జిని రేపు ఇంట్లో కూర్చుంటాను..నీకు న్యాయమూర్తి అయ్యే అర్హత ఉంది..ఇంట్లో కూర్చోకూడదని చెబుతారా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఈ కేసు చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version