Yogi Adityanath : ఇటీవల కాలంలో వీఐపీలకు వరుసపెట్టి బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా వార్నింగ్ వచ్చింది. ఆయనను చంపేస్తామంటూ కొందరు గుర్తుతెలియని దుండగులు ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి వార్నింగ్ మెసేజ్‌ను పంపారు. ‘‘బాబా సిద్దిఖీని ఎలాగైతే చంపామో.. యూపీ సీఎం యోగిని కూడా అలాగే చంపుతాం’’ అని ఆ మెసేజ్‌లో(Yogi Adityanath) దుండుగులు ప్రస్తావించారు. పది రోజుల్లోగా సీఎం పదవికి రాజీనామా చేయాలని యోగిని హెచ్చరించారు. శనివారం సాయంత్రం తమకు ఈ మెసేజ్ వచ్చిందని ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగం వెల్లడించింది.
Also Read :IRCTC Special Trains : ‘దివ్య దక్షిణ్ యాత్ర’.. కార్తీక మాసంలో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ట్రైన్
గత నెలలోనే ముంబైలో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ దారుణ హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు దాదాపు 15 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారిలో పలువురు నిందితులు తమకు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ నుంచి డబ్బులు, ఆయుధాలు అందాయని చెప్పినట్లు సమాచారం. లారెన్స్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. అతడి సోదరు అన్మోల్ బిష్ణోయి కెనడా, అమెరికాలలో ఉంటూ భారత్‌లోని తమ షూటర్లకు వర్క్‌ను అసైన్ చేస్తున్నాడు. లారెన్స్ గ్యాంగ్ షూటర్ల హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్, బాబా సిద్దిఖీ కుమారుడు జీషాన్ సిద్దిఖీ కూడా ఉన్నారని అంటున్నారు.
Also Read :4000 Year Old Town : ఒయాసిస్ మాటున.. 4వేల ఏళ్ల కిందటి పట్టణం
సల్మాన్ ఖాన్‌కు గతంలో చాలాసార్లు లారెన్స్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయనకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఎలాగూ భారీ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన ఏకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ) కమాండోల పహారా ఉంటుంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ మోహరింపు యోగి చుట్టూ ఉంటుంది. ఎక్కువగా ముప్పు కలిగి ఉన్న నేతలకు ఎన్ఎస్‌జీ రక్షణ కల్పిస్తారు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ వ్యవస్థ మనదేశంలో చాలా తక్కువ మందికే ఉంది.