Torn Jeans Ban : టీషర్ట్, చిరిగిన జీన్స్‌తో కాలేజీకి రావొద్దు

ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

  • Written By:
  • Updated On - July 3, 2024 / 11:03 AM IST

Torn Jeans Ban : ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఈ కాలేజీ విద్యార్థినులు హిజాబ్‌ ధరించడాన్ని బ్యాన్(Torn Jeans Ban) చేసింది. తాజాగా ఈ కాలేజీ యాజమాన్యం ఇంకో కీలక ప్రకటన చేసింది. కాలేజీ ఆవరణలో విద్యార్థులు  టీషర్ట్‌లు, చిరిగిన జీన్స్‌(టాన్‌), జెర్సీలు ధరించడంపై నిషేధం విధిస్తున్నట్లు అనౌన్స్ చేసింది. తమ కాలేజీకి వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులను క్యాంపస్‌లో ధరించవద్దని ఆర్డర్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join

ఫార్మల్, డీసెంట్‌ దుస్తులతో పాటు హాఫ్‌ లేదా ఫుల్‌ షర్ట్, ప్యాంటులను కాలేజీ క్యాంపస్‌లో ధరించవచ్చని కాలేజీ సూచించింది. తమ కాలేజీకి వచ్చే విద్యార్థినులు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చని పేర్కొంటూ జూన్‌ 27న ఓ నోటీసును చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ జారీ చేసింది. దీని ఆధ్వర్యంలో  ముంబైలో ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠే కాలేజీలను నిర్వహిస్తున్నారు.

Also Read :Tollywood : డిసెంబర్ సినిమాలకు రెడ్ అలర్ట్ తప్పదా..?

2021 సంవత్సరం మార్చిలోనూ చిరిగిన జీన్స్‌పై దుమారం రేగింది. అప్పట్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీర్థ్‌సింగ్ రావత్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు యువతను పట్టిపీడిస్తున్న సమస్య చిరిగిన జీన్స్. నాతో పాటు ఫ్లైట్‌లో ప్రయాణించిన ఒక మహిళ రిప్డ్ జీన్స్, బూట్లు, చేతికి బ్రేస్‌లెట్ ధరించి ఉంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ మహిళ స్వచ్ఛంద సేవా సంస్థను నిర్వహించేది. మీరొక స్వచ్చంద సంస్థను నిర్వహిస్తూ, మోకాళ్ల దగ్గర చిరిగిన జీన్స్‌ని ధరించారు. మీతో పాటు పిల్లలున్నారు? వారికేం విలువలు నేర్పిస్తారు? అని అడిగాను’’ అని పేర్కొన్నారు. ‘‘భారతీయులు చిరిగిన జీన్స్ ధరించి నగ్నత్వం వైపు పరుగులు పెడుతుంటే.. విదేశీయులు మాత్రం ఒళ్లంతా కప్పే దుస్తులతో యోగా చేస్తున్నారు’’ అని తీర్థ్‌సింగ్ రావత్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మహిళలకు క్షమాపణ చెప్పాలని లేదా పదవి నుంచి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

Also Read :Team India: స్వ‌దేశానికి టీమిండియా రాక మ‌రింత ఆల‌స్యం..!