Site icon HashtagU Telugu

Mumbai : లైసెన్స్ లేకుండా బాణ‌సంచా విక్ర‌యిస్తే చ‌ర్య‌లు.. ముంబై పోలీసుల హెచ్చరిక

cracker

cracker

ముంబై నగరంలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయాలను ముంబై పోలీసులు బుధవారం నిషేధించారు. సిటీ పోలీస్ కమీషనర్ మంజూరు చేసిన ఉత్వ‌ర్వుల ప్ర‌కారం.. సరైన లైసెన్స్ లేకుండా పటాకులు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నిషేధాజ్ఞలు అక్టోబర్ 19 సాయంత్రం 4 గంటల నుండి అమలులోకి వ‌చ్చాయి. నవంబర్ 14 వరకు ఈ నిషేధం వ‌ర్తింస్తుంది. ప్రజలకు ఆటంకం, అసౌకర్యం, ప్రమాదం లేదా నష్టం జరగకుండా ఉండేందుకు ఈ ఆర్డర్ జారీ చేసిన‌ట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) సంజయ్ లాట్లర్ తెలిపారు.

మరోవైపు దేశ రాజధానిలో పటాకుల తయారీ, విక్రయాలు, పటాకులు పేల్చితే జైలు శిక్ష విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి పటాకులు పేల్చితే గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తామని పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం ప్రకటించారు. పటాకులు తయారు చేయడం, నిల్వ చేయడం మరియు విక్రయించడం శిక్షార్హమైన నేరమని.. రూ. 5000 వరకు జరిమానా మరియు మూడేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని మంత్రి తెలిపారు. నిషేధం అమలు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం 408 బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో 210 బృందాలను ఏర్పాటు చేయగా, రెవెన్యూ శాఖ 165 బృందాలను, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ 33 బృందాలను ఏర్పాటు చేసింది.