Site icon HashtagU Telugu

Alert : ఇవాళ ముంబై ఎయిర్ పోర్టు మూసివేత..!!

Indian Aviation History

Indian Aviation History

నిత్యం అత్యంత రద్దీగా ఉండే ముంబై ఎయిర్ పోర్టు మంగళవారం 6గంటలపాటు మూతపడనుంది. ఈ సమయంలో ఎయిర్ పోర్టులో విమానాలు నిలిచిపోయనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎయిర్ పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిర్వహణ పనులు రన్ వే నెంబర్ 14/32రన్ వే నెబర్ 09/27 ఈ రెండింటిలోనూ జరగనున్నాయి. కార్యకలాపాలకు సంబంధించి అన్ని ఎయిర్ లైన్స్, సంస్థలతో సమన్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా ఎయిర్ పోర్టులు పలు సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీని కారణంగానే అక్టోబర్ 14న 8 విమానాలను దారి మళ్లించినట్లు చెప్పారు. దీని గురించి ప్రయాణీకులుందరికీ సమచారం అందించినట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతోనే విమానాలను దారి మళ్లించినట్లు వెల్లడించారు.