Mumbai Airport Suspension:ముంబై విమానాశ్రయం.. ఆ రోజు ఆరు గంటలు బంద్!!

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ దేశంలోనే అత్యంత రద్దీ అయినది.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 01:01 PM IST

ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్​ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ దేశంలోనే అత్యంత రద్దీ అయినది. ఇది అక్టోబర్​ 18న ఆరు గంటల పాటు పనిచేయదు. ఆ రోజున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రన్​వేలను మూసివేయనున్నారు. అక్టోబర్​ 18న ముంబై ఎయిర్​పోర్ట్​లోని రెండు రన్​వేలు(9/27- 14/32) మూసేస్తామని వెల్లడించింది. దీనిపై ముంబై ఎయిర్​పోర్ట్​ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక పండుగ సీజన్​ సమీపిస్తుం డటంతో.. ముంబై విమానాశ్రయంలో రద్దీ మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి ప్రతిరోజు 800 కుపైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విమానాశ్రయం నిర్వహణ పనుల కోసం అక్టోబర్ 18న 6 గంటల పాటు రన్ వేస్ బంద్ చేస్తారు. సాధారణంగా రుతుపవనాల సమయం ముగిసిన తర్వాత ఎయిర్ పోర్ట్ నిర్వహణ పనులు చేస్తూ ఉంటారు. ఈసారి అక్టోబర్​ 18న ఈ కార్యకలాపాలు చేపట్టారు ముంబై ఎయిర్​పోర్ట్​ సిబ్బంది. ప్రయాణికులు, విమానాల భద్రత కోసం ఇలాంటి నిర్వహణ పనులు చేస్తారు. ముంబై విమానాశ్రయం రన్​వేల మూసివేతతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. పలు విమానాల సర్వీసులను ఇప్పటికే రీషెడ్యూల్​ చేశారు. ఫలితంగా మెయింటేనెన్స్​కి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ విషయంలో ప్రయాణికుల నుంచి సహకారాన్ని ఆశిస్తున్నట్టు ముంబై ఎయిర్​పోర్ట్​ అభిప్రాయపడింది. ముంబై విమానాశ్రయంలో అదానీ గ్రూప్​నకు 74శాతం వాటా ఉంది. 2022 సెప్టెంబర్​ 17న.. 1,30,374మంది ప్రయాణికులు ఈ ముంబై విమానాశ్రయాన్ని వినియోగించుకున్నారు. ఇదొక రికార్డు. 95,080మంది ప్రయాణికులు టర్మినల్​ 2 ద్వారా ప్రయాణాలు చేశారు. 35,294 మంది.. టర్మినల్​ 1 నుంచి ప్రయాణించారు. ఆ ఒక్క రోజులో 839 విమానాలు ముంబై ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ అయ్యాయి.