Site icon HashtagU Telugu

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్… పెనాల్టీలు, పెన్షన్ నిలివేత ఆర్డర్లు!?

7th Pay Commision

7th Pay Commision

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగం అంటే హాయిగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసే ఉద్యోగం అని అందరికీ తెలుసు. అయితే ఏ తప్పు చేసినా ఏమీ కాదు అనే భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉండగా.. తాజాగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఇక మీదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెనాల్టీలు విధించేలా, అలాగే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందే పెన్షన్ మరియు గ్రాట్యూటిని నిలిపివేసేలా కీలక ఆర్డర్లు వెల్లడయ్యాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి కంటే ఎక్కువ పెనాల్టీల విధించడానికి వీలు కల్పిస్తూ తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆఫీస్ మెమోరాండం విడుదల చేసింది. దీని ప్రకారం మొదటి పెనాల్టీ నగదు రూపంలో ఉండబోతోంది. క్రమ శిక్షణా చర్యలను అమలు చేసే సమయంలో పెనాల్టీలకు సంబంధించిన విషయాన్ని స్పష్టం చేయాలని కేంద్రం వివరించింది. సెవన్త్ పే కమీషన్ పే మెట్రిక్స్ ప్రకారం జీతాలు అందుకునే ఉద్యోలపై పెనాల్టీలు విధించేలా తాజా మార్పులను చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మొదటి పెనాల్టీకి గురైన తర్వాత రెండో పెనాల్టీ అమలు చేయడం విషయంలో.. ఏక కాలంలో రెండో పెనాల్టీని లేదా మరిన్నింటిని అమలు చేయాలనే అనే విషయాన్ని పనిష్మెంట్ ఆర్డర్ లో పేర్కొనాలని డిసిప్లెనరీ అధార్టీస్ వివరించింది. మొదటి పెనాల్టీ కరెన్సీ సమయంలో రెండో లేదా తదుపరి పెనాల్టీలను అందజేసేటప్పుడు తప్పకుండా వివరాలు అందించాలని, అలా నిర్దిష్ట ప్రస్తావన చేయని చోట, రెండు/అన్ని పెనాల్టీలు ఏకకాలంలో అమలు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ తెలిపింది.

రిటైర్డ్ ఉద్యోగులకు షాక్…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సీఎస్ఎస్ (పెన్షన్) రూల్స్ 2021 లోని రూల్ 8కి సవరణను నోటిఫై చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీస్ లో ఎలాంటి తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా నిర్లక్ష్యం చూపించినా లేదంటే నిబంధనలను అతిక్రమించినా.. సదరు ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ లేదా గ్రాట్యుటీ లేదా రెండింటినీ నిలిపివేయాలనే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నిర్ణయం ఎవరు తీసుకోవాలనే విషయాన్ని ఏ అధికారులు తీసుకోవాలనే విషయాలను కూడా తాజాగా సవరించడం జరిగింది.

Exit mobile version