Site icon HashtagU Telugu

Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్‌, భటిండాలలో రెడ్ అలర్ట్

Drone Explosions In Punjabs Border Districts Red Alert Amritsar Bathinda

Red Alert: ఈరోజు (శనివారం) వేకువజాము నుంచి పాకిస్తాన్ ఆర్మీ భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న అమృత్‌సర్‌, భటిండా, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, తరన్ తరన్, జలంధర్, హోషియార్ పూర్ లక్ష్యంగా డ్రోన్ దాడులు జరుపుతోంది.  ఆయా చోట్ల డ్రోన్లు పేలినట్లు స్థానికులు మీడియాకు తెలిపారు. చాలావరకు పాక్ డ్రోన్లను భారత ఆర్మీ గాల్లోనే నిర్వీర్యం చేసి పేల్చేసింది. ఎక్కువ ప్రభావం మాత్రం అమృత్‌సర్‌, భటిండాలపై  ఉంది. ఆ రెండు చోట్ల రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. ఈరోజు తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్‌ పరిధిలోని గగనతలంలో పాకిస్తాన్ డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు(Red Alert) కూల్చేశాయి. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. చండీగఢ్‌, పఠాన్‌కోట్‌లలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో పాక్ డ్రోన్ దాడులు జరిగాయని సమాచారం. పంజాబ్‌లోని అమృత్‌సర్‌, ఫిరోజ్‌‌పూర్, జమ్మూలోని శంభూలపై పాకిస్తాన్ మిస్సైల్స్ ఎటాక్ చేసింది. ఆయా చోట్ల  పాకిస్తాన్ క్షిపణుల శకలాలు లభ్యమయ్యాయి. ఆయా మిస్సైళ్లను భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థ ధ్వంసం చేసింది.

Also Read :Operation Sindoor Movie: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మూవీ.. పోస్టర్‌ వచ్చేసింది

జమ్మూ బార్డర్ నుంచి గుజరాత్‌ బార్డర్ వరకు.. 

శుక్రవారం అర్ధరాత్రి నుంచే జమ్మూ బార్డర్ నుంచి గుజరాత్‌ బార్డర్ వరకు పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లతో దాడులకు యత్నిస్తోందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.  జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌ విమానాశ్రయం, ఎయిర్ బేస్‌లపైనా డ్రోన్లతో దాడికి పాక్‌ యత్నించింది. వీటిని భారత సైన్యం బలంగా తిప్పికొట్టింది.  శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. రాజౌరిని లక్ష్యంగా చేసుకొని పాక్‌ ఆర్మీ జరిపిన దాడుల్లో జమ్మూకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్‌ థప్పా చనిపోయారు.పాక్ దాడుల నేపథ్యంలో భారత సైనిక అధికారులు సరిహద్దు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్‌ సరఫరాను బంద్ చేశారు. పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడులకు భారత ఆర్మీ మరింత బలంగా స్పందించే అవకాశం ఉంది. కాగా, భారత వాయుసేన దాడులు చేస్తుందనే భయంతో పాకిస్తాన్  తమ గగనతలాన్ని మూసేసింది.

Also Read :India Attack : పాక్ వైమానిక స్థావరాలపై భారత్‌ ఎటాక్.. బార్డర్‌లోని డ్రోన్ల లాంచ్ ప్యాడ్ ధ్వంసం