Mukhyamantri Samman Yojana : ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద 18 ఏండ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ. 1000 భృతి అందచేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt)ప్రకటించింది. ఢిల్లీ ఆర్ధిక మంత్రి అతిషి(Finance Minister Atishi) రూ. 76,000 కోట్ల బడ్జెట్(Budget)ను సోమవారం సభలో సమర్పించారు. ఇది అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదవ బడ్జెట్ కావడం విశేషం.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో విద్యపై వెచ్చించేందుకు ఆదాయం లేకపోవడంతో ఢిల్లీ వాసులు(delhi people) తమ కొడుకులను ప్రైవేట్ స్కూల్స్‌కు, కూతుళ్లను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారని బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ మంత్రి అతిషి తెలిపారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్స్‌లో చదివే బాలికలు ఐఐటీ, నీట్ పరీక్షలను క్లియర్ చేస్తున్నారని చెప్పారు. దీంతో గతంలో డబ్బున్న కుటుంబాల పిల్లలు సంపన్నులుగా, పేదల పిల్లలు పేదవారిగా కొనసాగుతారనే నానుడి మారిన పరిస్ధితి నెలకొందన్నారు.
read also: Udhayanidhi: మీరోక మంత్రి..మాటల పర్యవసానాలు తెలిసి ఉండాలిః ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు
2015 నుంచి కేజ్రీవాల్ ప్రభుత్వం 22,711 నూతన తరగతి గదులను నిర్మించిందని చెప్పారు. విద్యకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ ఏడాది విద్యకు రూ. 16,396 కోట్లు కేటాయించామని తెలిపారు. హనుమంతుడు సంజీవనితో లక్ష్మణుడిని కాపాడిన విధంగా సత్యేందర్ జైన్ ఢిల్లీ ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధను పునరుద్ధరించారని ఆమె తెలిపారు.