టాప్ లెవల్ కుబేరుల్లో ముఖేష్

ఆసియా నెంబ‌ర్ కుబేరుడు రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 100 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో స్థానం ల‌భించింది. కేవ‌లం 11తో కూడిన ప్ర‌పంచ కుబేరుల జ‌ఫ్ బెజాస్, అలెన్ మ‌స‌క్ క్ల‌బ్ లోకి ముకేష్ అడుగుపెట్టాడు. తాజాగా ముఖేష్ అంబానీ సంప‌ద 100 బిలియ‌న్ డాల‌ర్లు దాటిపోయింది.

  • Written By:
  • Updated On - October 9, 2021 / 03:52 PM IST

ఆసియా నెంబ‌ర్ కుబేరుడు రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అంబానీకి 100 బిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్ లో స్థానం ల‌భించింది. కేవ‌లం 11తో కూడిన ప్ర‌పంచ కుబేరుల జ‌ఫ్ బెజాస్, అలెన్ మ‌స‌క్ క్ల‌బ్ లోకి ముకేష్ అడుగుపెట్టాడు. తాజాగా ముఖేష్ అంబానీ సంప‌ద 100 బిలియ‌న్ డాల‌ర్లు దాటిపోయింది. స్టాక్ మార్కెట్ లో పెరిగిన సంప‌ద ఆధారంగా ముకేష్ సంప‌ద విలువ ప్ర‌స్తుతం 100.6 బిలియ‌న్ డాల‌ర్లు. ఈ ఏడాది ఆయ‌న సంప‌ద 23.8 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగింద‌ని బ్లూంబ‌ర్గ్ మిలియ‌నీర్ల ముఖ‌ప‌త్రం స్ప‌ష్టం చేస్తోంది.

చిల్ల‌ర వ‌ర్త‌కం,ఆయిల్‌, టెక్నాల‌జీ రంగాల్లో వ్యాపార‌, వాణిజ్యాల‌ను ముకేష్ చేస్తున్నాడు. 2005 నుంచి వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చిన ముడి చ‌మురు, పెట్రో కెమిక‌ల్స్ వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రింప చేశాడు. టెక్నాల‌జీ, ఈ కామ‌ర్స్ రంగంలోకి అడుగుపెట్టిన రిల‌యెన్స్ అధినేత ముఖేష్ అన‌తికాలంలోనే ప్ర‌ముఖంగా వెలిగిపోతున్నాడు. టెలికం రంగంలోకి 2016లో ప్ర‌వేశించిన రిల‌యెన్స్ అనూహ్యంగా లాభాల బాట ప‌ట్టింది. రిటైల్, టెక్నాల‌జీ రంగాల్లోని రిల‌యెన్స్ గ‌త ఏడాది 27 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను ఆర్జించింది. ఫేస్ బుక్, గుగూల్ వంటి ప్ర‌ముఖ సంస్థ‌ల్లో భాగ‌స్వామ్యం కావ‌డానికి భారీగా పెట్టుబ‌డులు ముఖేష్ పెట్టాడు. మూడేళ్ల‌లో 10 బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబడిగా పెట్టేందుకు గ్రీన్ ఎన‌ర్జీ విభాగం వైపు ఇటీవ‌ల ఆయ‌న అడుగువేశాడు.

ప్ర‌స్తుతం ముడిచ‌మురును దిగుమ‌తి చేసుకునే దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉంది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎన‌ర్జీ ద్వారా దిగుమ‌తుల‌ను త‌గ్గించుకోవ‌డంతో పాటు కాలుష్య ర‌హిత ఇంధ‌నం ఉప‌యోగించేలా చేయాల‌ని మోడీ ల‌క్ష్యం. ఆ టార్గెట్ దిశ‌గా రిల‌యెన్స్ ను ముందుకు న‌డ‌ప‌డానికి ముఖేష్ ముందుకు క‌దిలారు. స‌మీప భ‌విష్య‌త్ లో సిమెంట్ ఇండిస్ట్రీస్ వైపు మ‌ళ్లేందుకు ఆలోచిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయిల్ నుంచి కెమిక‌ల్ విభాగంలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి దుబాయ్ ఆయిల్ కంపెనీల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది.
రిల‌యెన్స్ గ్రూప్ చ‌రిత్ర‌లోకి వెళితే..దీన్నీ స్థాపించిన ధీరూభాయ్ అంబానీ 1960లో యెమెన్ దేశంలోని ఒక పెట్రో కంపెనీలో కూలీ. అక్క‌డ స‌ముపార్జిన సంప‌ద‌ను ఇండియాలో పాలిస్ట‌ర్ వ్యాపారాన్ని విస్త‌రింప చేయ‌డానికి పెట్టుబ‌డిగా పెట్టాడు. సుదీర్ఘ కాలం ఆ వ్యాపారంలో చ‌క్ర‌వ‌ర్తిగా ఎదిగాడు. గుండెపోటుతో ధీరూభాయ్ అంబానీ 2002లో చ‌నిపోయాడు. వార‌సులుగా ముఖేష్‌, అనిల్ కంపెనీల‌ను విజ‌య ప‌థాన న‌డిపించారు. త‌ల్లి కోకిలాబెన్ స‌మ‌క్షంలో 2005లో ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు కంపెనీల‌ను పంచుకున్నారు. ముడిచ‌ములు, పెట్రో కెమిక‌ల్స్ వ్యాపారాన్ని ముఖేష్ కు అప్ప‌గించారు. విద్యుత్‌, టెలికం, ఆర్థిక సేవా రంగాల్లోకి అనిల్ ప్ర‌వేశించాడు. ఒక‌ప్పుడు అనిల్ బిలియ‌నీర్..ప్ర‌స్తుతం జీరో అయ్యాడు. ఆ విష‌యాన్ని లండ‌న్ కోర్టు గ‌త ఏడాది చెప్పింది.

ప్ర‌పంచ కుబేరుల జాబితాలోకి చాలా మంది ఇండియా బిలియ‌నీర్స్ వెళ్లారు. రెండేళ్లుగా మిలియ‌నీర్స్ సంఖ్య పెరుగుతోంది. ఆసియాలోనే భార‌త బిలియ‌నీర్ల సంప‌ద ఎక్కువ‌గా పెరుగుతోంది. అదానీ గ్రూప్ అధినేత గౌత‌మ్ ఆదానీ ఏడాది కాలంలోనే 39.5 బిలియ‌న్ డాల‌ర్ల సంప‌ద‌ను పొందాడు. దేశంలోని మూడో అతి పెద్ద కుబేరుడు అజీజ్ ప్రేమ్ జీ ఈ ఏడాది 12.8 బిలియ‌న డాల‌ర్ల సంప‌ద‌ను ఆర్జించాడు. వీళ్లంద‌రిలోనూ ముఖేష్ ఆధ్వ‌ర్యంలోని రిల‌యెన్స్ సంప‌దను అనూహ్యంగా ఆర్జించ‌డంలో దూసుకు వెళుతోంది. ప్ర‌పంచ టాప్ కుబేరుల జాబితాలోకి వెళ్లిన ముఖేష్ అనతి కాలంలోనే వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ 1 కుబేరునిగా ఎదిగే దిశ‌గా ప‌రుగు పెడుతున్నాడు. ఆయ‌న విజ‌యాన్ని భార‌త విజ‌యంగా కేంద్రం కూడా అక్క‌డ‌క్క‌డ ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం.