Mukesh Ambani: ఆ ముగ్గురికి `ముఖేష్` సామ్రాజ్యం

ఆసియాలో అతిపెద్ద సంస్థ‌గా పేరున్న రిల‌యెన్స్ యాజ‌మాన్య వార‌స‌త్వ ప్ర‌క్రియ ప్రారంభం అయింది. ముఖేష్ సామ్రాజ్యానికి వార‌సులుగా ఆకాష్‌, ఇషా, అనంత్ లు ప‌ట్టాభిషిక్తులు కాబోతున్నారు.

  • Written By:
  • Updated On - December 30, 2021 / 05:45 PM IST

ఆసియాలో అతిపెద్ద సంస్థ‌గా పేరున్న రిల‌యెన్స్ యాజ‌మాన్య వార‌స‌త్వ ప్ర‌క్రియ ప్రారంభం అయింది. ముఖేష్ సామ్రాజ్యానికి వార‌సులుగా ఆకాష్‌, ఇషా, అనంత్ లు ప‌ట్టాభిషిక్తులు కాబోతున్నారు. అందుకు సంబంధించిన వ్య‌వ‌హారాల‌ను చాలా వేగంగా ముఖేస్ న‌డుపుతున్నాడు. ఆసియాలో అత్యంత సంప‌న్నుడుగా ఉన్న ముఖేష్ అంబానీ సామ్రాజ్యాన్ని కొంత పుంత‌లు తొక్కించ‌డానికి వార‌సుల‌ను రంగంలోకి దింపుతున్నాడు. ముఖేష్ ముగ్గురు పిల్లలకు $217 బిలియన్ల సామ్రాజ్యాన్ని అప్ప‌గించ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. రిటైల్-టు-రిఫైనింగ్ వ‌ర‌కు త‌రువాత తరానికి చెందిన సీనియర్ల నుండి తదుపరి తరం యువ నాయకులకు నాయకత్వ మార్పు చేసే ప్రక్రియలో ఉంది” అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల కార్యక్రమంలో మంగళవారం అంబానీ ప్ర‌క‌టించాడు.

“ఈ ప్రక్రియ వేగవంతం కావాలని ఆదేశించాడు. ” బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా దాదాపు $91 బిలియన్ల విలువ కలిగిన అంబానీ నాయ‌క‌త్వ మార్పు ఎలా ఉంటుంద‌న్న దానిపై వివరాలను ఇవ్వలేదు. గ‌తంలోని అనేక వారసత్వ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వాల్‌మార్ట్ ఇంక్ కు చెందిన వాల్టన్ కుటుంబానికి చెందిన అంశాలను బ్లూమ్‌బెర్గ్ నవంబర్‌లో నివేదించింది. అనేక సంపన్న వంశాలను విచ్ఛిన్నం చేసిన వారసత్వ పోరును నివారించాలనుకుంటున్నాడు. రిలయన్స్‌లో మార్పు అతిపెద్ద సంపద బదిలీలలో ఒకటిగా గుర్తించబడుతుంది.
రిలయన్స్ గ్రూప్‌లో “అత్యంత సమర్థత, అత్యంత నిబద్ధత, నమ్మశక్యంకాని ఆశాజనక ప్రతిభకు లొంగిపోవాలి” అని ముఖేష్ వివ‌రించాడు. తమ్ముడు అనిల్ అంబానీతో 2002లో వీలునామా లేకుండానే స‌క్ర‌మంగా నాయకత్వ మార్పును సజావుగా చేసుకున్నాడు. తల్లి కోకిలాబెన్ అంబానీ 2005లో కుటుంబ ఒప్పందాన్ని కుదుర్చుకోవలసి వచ్చింది. ఆ ప్ర‌క్రియ ఇద్దరు సోదరుల మధ్య రిలయన్స్ వ్యాపారాలను విభజించింది.
రిలయన్స్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా తన బాధ్యతల నుండి వైదొలగడానికి అంబానీ ఎటువంటి ప్రణాళిక లేదా టైమ్‌లైన్‌ను బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, గ్రూప్ లో అంబానీ పిల్లలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ జూన్‌లో వాటాదారులను ఉద్దేశించి… ఆకాష్ , ఇషా , అనంత్ లు కంపెనీలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారని సూచించాడు.

బిలియనీర్ తన కుటుంబం యొక్క హోల్డింగ్‌లను ట్రస్ట్ లాంటి నిర్మాణంలోకి మార్చాలని ఆలోచిస్తున్నాడు. అది ముంబై-లిస్టెడ్ ఫ్లాగ్‌షిప్ రిలయన్స్‌ను నియంత్రిస్తుంది. ఆ మేరకు బ్లూమ్‌బెర్గ్ గత నెల నివేదించింది. మంగళవారం తన ప్రసంగంలో, నాయకత్వ మార్పులో భాగంగా తన పిల్లలు ఎక్కువ బాధ్యతలు తీసుకుంటున్నారని అంబానీ పునరుద్ఘాటించారు. తన తండ్రి ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ స్థాపించి భారతదేశ వృద్ధికి దోహదపడిన విష‌యాన్ని గుర్తు చేశాడు. అదే స్పార్క్ , సామర్థ్యాన్ని తన పిల్లలు ప్ర‌ద‌ర్శిస్తార‌ని అన్నాడు. తదుపరి తరం నాయకులుగా ఆకాష్, ఇషా , అనంత్‌లు రిలయన్స్‌ని ఉన్న‌త శిఖరాలకు తీసుకెళ‌తార‌ని అంచ‌నా వేస్తున్నాడు.