Site icon HashtagU Telugu

RajyaSabha : ఆ 12 మంది ఎంపీల సస్పెన్షన్ ను రద్దుచేయం!

Venkaiahnaidu

Venkaiahnaidu

శీతాకాల సమావేశాల తొలిరోజు 12 మంది విపక్ష సభ్యులను రాజ్యసభ చైర్మన్ సస్పెండ్ చేయడంపై దుమారం రేగింది. గత సెషన్ లో వెల్ లోకి దూసుకొచ్చి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. పేపర్లను చింపేసి విసిరేశారు. మళ్లీ ఇలాంటిది జరగకుండా ముందు జాగ్రత్తగా ఆ 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, క్షమాపణ చెబితేనే సస్పెన్షన్ ఎత్తేస్తామని, లేదంటే సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు.

“ఈ సభ సభాపతి అధికారాన్ని పూర్తిగా విస్మరించడం, సభ నియమాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, తద్వారా వారి అపూర్వమైన దుష్ప్రవర్తన, ధిక్కార, వికృత హింసాత్మక చర్యల ద్వారా సభ కార్యకలాపాలను ఉద్దేశపూర్వకంగా నిరోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది’’ అని అన్నారు.

తాజాగా 12 మంది ఎంపీల సస్పెన్షన్‌ను రద్దు చేయబోమని రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు మంగళవారం తెలిపారు. “దౌర్జన్యానికి పాల్పడిన సభ్యులు పశ్చాత్తాపం చూపలేదు. కాబట్టి, ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవడం విలువైనది కాదని నేను భావిస్తున్నాను, ”అని నాయుడు అన్నారు. సోమవారం 12 మంది ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు రాజ్యసభలో అన్ని విధానాలు నిబంధనల ప్రకారమే జరిగాయన్నారు. “రాజ్యసభ ఛైర్మన్ చర్య తీసుకునే అధికారం ఉంది ” అని నాయుడు అన్నారు.