Site icon HashtagU Telugu

Lok Sabha : నేటి నుంచి లోక్ సభలో కొత్త సంప్రదాయం

Lok Sabha Mps To Use Digita

Lok Sabha Mps To Use Digita

లోక్ సభ (Lok Sabha) లో నేటినుండి కొత్త సంప్రదాయం ప్రారంభమైంది. ఇక నుంచి సభకు హాజరయ్యే ఎంపీలు ఎలక్ట్రానిక్ ట్యాబ్లో డిజిటల్ పెన్తో అటెండెన్స్ (MPs attendance) వేయాల్సి ఉంటుంది. పార్లమెంటులో పేపర్ వాడకూడదన్న స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) ఆకాంక్ష మేరకు లాబీలో 4 కౌంటర్ల వద్ద ట్యాబుల్ని ఉంచుతున్నామని LS సెక్రటేరియట్ తెలిపింది. ఫిజికల్ అటెండెన్స్ రిజిస్టర్లూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గతంలో సభ్యులు మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసేవాళ్లు. ఇప్పటి నుండి ఎలక్ట్రానిక్ ట్యాబ్లో డిజిటల్ పెన్తో అటెండెన్స్ వేయడం స్టార్ట్ అయ్యింది.

ఇక పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈరోజు నుంచి మొదలై డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న ఈ సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం సమావేశాలు వాడివేడిగా నడుస్తున్నాయి.

అదానీ అంశం, మణిపుర్‌ హింస వంటివి సభలో ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎంపీలు కేసీ వేణుగోపాల్, మనీశ్‌ తివారీ, మాణిక్కం ఠాగూర్- అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడ్డారనే అంశంపై చర్చించాలని, ఈ అంశంపై జేపీసీని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ముఖ్యంగా అదానీ అంశంపై చర్చించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేయడం తో లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటలకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.

Read Also : Winter Parliament Sessions : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు