Site icon HashtagU Telugu

Swati Maliwal : దాడి ఘటనపై స్పందించిన ఎంపీ స్వాతి మాలీవాల్‌

Mp Swati Maliwal Reacted To

MP Swati Maliwal reacted to the incident of attack

Swati Maliwal: ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌(Swati Maliwal) ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(CM Arvind Kejriwal) నివాసంలో తన పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. ఆరోజు ఏం జరిగిందనేది పోలీసులకు స్పష్టంగా వివరించానని, పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారని తెలిపారు. ఈ విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘దురదృష్టవశాత్తూ నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ విషయంలో నాకోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు. దీనిపై నా క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించిన వారికీ దేవుడు మంచి చేయాలనే కోరుకుంటున్నా’ అంటూ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. దేశంలో అత్యంత కీలకమైన ఎన్నికలు జరుగుతున్నాయని గుర్తుచేస్తూ.. తనపై జరిగిన దాడిని రాజకీయం చేయొద్దని బీజేపీ నేతలకు స్వాతి మలివాల్ విజ్ఞప్తి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, స్టేట్‌ మెంట్‌లో వివరాలు..కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహయకుడు బిభవ్‌ కుమార్‌ నాపై దాడికి దిగాడు. చెంపపై కొట్టి, కాలితో తన్నాడు. కర్ర తీసుకుని బాదాడు. కడుపుపైనే గాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. తన నుంచి తప్పంచుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశారు. అనంతరం పోలీస్ లైన్స్ లోని స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. వైద్య పరీక్షలు చేయించాలని చెప్పడంతో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తానని వెళ్లిపోయారు. ఎంపీ స్వాతి మలివాల్ చెప్పిన వివరాలతో స్టేట్ మెంట్ రికార్డు చేసి దీని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని డీసీపీ మీనా తెలిపారు. సీఎం కేజ్రీవాల్ పీఏ బిబవ్ కుమార్ కు నోటీసులు పంపించినట్లు వివరించారు.

Read Also: Illegal Affair : వివాహేతర సంబంధాలకు కారణాలు ఇవే..!!

మరోవైపు దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13న కేజ్రీవాల్‌ నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది.