Madhya Pradesh Assembly Electinos 2023: మధ్యప్రదేశ్‌లో 27.62 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం ఉదయం 11 గంటల వరకు జరిగిన రెండో విడతలో 19.65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి, 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్ కి 70 స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతుండగా, ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశలో 20 స్థానాలకు నవంబర్ 7న పోలింగ్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్ కోసం 18,800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 70 స్థానాల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంటే… శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.
ఎన్నికల సందర్భంగా దాదాపు 700 కంపెనీల కేంద్ర బలగాలు, రాష్ట్రంలోని 2 లక్షల మంది పోలీసులను భద్రత కోసం మోహరించారు. 2,500 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. దాదాపు 5.59 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో 2.87 కోట్ల మంది పురుషులు, 2.71 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.