Site icon HashtagU Telugu

MP & MLAs Salary & Benefits : ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎన్ని ప్రయోజనాలా..?

Mp Mla Salary

Mp Mla Salary

ప్రస్తుత కాలంలో రాజకీయ నేత(political Leader)గా ఎదగాలని అంత భావిస్తున్నారు. కొంతమంది సమాజానికి సేవచేయాల్సే తాపత్రేయం తో రాజకీయాల్లోకి వస్తే, మరికొంతమంది రాజకీయాల్లో తరతరాలకు సరిపడా ఆస్థి సంపాదించుకోవచ్చనే ఆలోచనతో వస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు , ఎంపీలకు జీతం ఎంత ఉంటుంది..? ఏ ఏ ప్రయోజనాలు (MP & MLAs Salary & Benefits) ఉంటాయి అనేది తెలుసుకోవాలనేది చాలామందికి ఉంటుంది.

ముందుగా ఎంపీ జీతం (MP Salary & Benefits)..వారికీ కలిగించే ప్రయోజనాలు చూస్తే..

ఎంపీకి నెలకు రూ.1లక్ష జీతం లభిస్తుంది. వీటితో పాటు ఆయనకు మొబైల్ ఛార్జీల కింద ఏడాదికి రూ.1.5లక్షలు ఇస్తారు. ఏడాదికి 34 ఫ్లైట్ టికెట్స్ ఉచితం. ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఏడాదికి ఉచితంగా 50వేల యూనిట్స్ విద్యుత్ & 4వేల కిలో లీటర్ల నీరు పొందొచ్చు. ప్రతినెలా రూ.62వేలు ఆఫీస్ అలవెన్స్, రూ.2లక్షలు హౌసింగ్ అలవెన్స్ వస్తాయి. పదవి పూర్తయ్యాక నెలకు రూ.25వేల పెన్షన్ వస్తుంది.

ఎమ్మెల్యే జీతం (MLAs Salary & Benefits) వారికీ లభించే ప్రయోజనాలు చూస్తే..

ఎమ్మెల్యేల జీతం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అత్యధిక జీతం తీసుకుంటున్నారు.వీరికి ప్రతి నెల జీతం రూ.2.50 లక్షలు అందుతోంది. ఏపీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.1.25 లక్షలు వస్తున్నాయి. ఇందులో శాలరీ కింద రూ.12 వేలు, అలవెన్స్‌ల కింద రూ.1.13 లక్షలు వస్తున్నాయి. మొత్తంగా రూ.1.25 లక్షలు లభిస్తున్నాయి. తెలంగాణతో పోలిస్తే ఇది సగం అని చెప్పొచ్చు.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర ఎమ్మెల్యేలు అతి తక్కువ జీతం పొందుతారు. మహారాష్ట్రలో రూ.2.32 లక్షలు, ఢిల్లీలో రూ.2.10 లక్షలు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ప్రతినెలా జీతం ఇస్తోంది. యూపీ ఎమ్మెల్యేలకు నెలకు రూ.1.87 లక్షలు, జమ్మూకశ్మీర్ ఎమ్మెల్యేలు నెలకు రూ.1.60 లక్షలు జీతం పొందుతున్నారు. త్రిపురతో పాటు నాగాలాండ్‌లో రూ.36 వేలు, మణిపూర్‌లో రూ.37 వేలు, అస్సాంలో రూ.42 వేలు, మిజోరంలో రూ.47 వేలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో రూ.49 వేలు ఎమ్మెల్యేలు అందుకుంటున్నారు. జీతంతో పాటు వారు ఉండడానికి ప్రభుత్వం వసతి కల్పిస్తుంది. వైద్య, ప్రయాణ భత్యం కూడా పొందుతారు. దీంతో పాటు ఎమ్మెల్యే పదవి నుంచి దిగిపోయిన తరువాత ప్రతినెలా పింఛన్ కూడా ఇస్తున్నారు.

Read Also : Musi : తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు..చేస్తున్న పద్ధతికి వ్యతిరేకం: ఈటల