Site icon HashtagU Telugu

Women’s Reservation Bill : మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించిన AIMIM

Mp Asaduddin Owaisi Women R

Mp Asaduddin Owaisi Women R

35 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళాబిల్లు (Women’s Reservation Bill)ను లోక్‌సభలో కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టింది. దీనిపై నేడు చర్చ జరుగుతుంది. ఈ బిల్లు కు ప్రతి ఒక్కరు ఆమోదం తెలుపుతుండడం తో మహిళా బిల్లు ఆమోదం ఖాయంగా కనిపిస్తున్నది. కాకపోతే ఈ బిల్లు అమ్మల్లోకి రావాలంటే పలు అడ్డంకులు దాటాల్సి ఉంటుంది. అవన్నీ దాటాలంటే మరికొన్ని ఏళ్లు ఎదురుచూడకతప్పదు. ఇదిలా ఉంటె ఈ బిల్లు ఫై ఏఐఎంఐఎం (AIMIM) అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ (MP Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. అందుకు గల కారణాలను కూడా చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లింలు (Muslims), ఓబీసీ (OBC) వర్గాలకు కోటా కేటాయించలేదని.. ఇది అన్యాయం అన్నారు. ఈ కారణంగానే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు ఎంపీ అసదుద్దీన్. కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రాతినిధ్యం ఉన్న వారికి ప్రాముఖ్యత కల్పించేలా బిల్లును తీసుకు వస్తున్నారు. అయితే మన దేశంలో ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 8,992 మంది ఎంపీలు ఎన్నికైతే.. అందులో 520 మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు. అంటే సుమారు 50 శాతానికి పైగా లోటు ఉంది’’ అని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు.

‘‘ఇక ఆ 520 మందిలోనూ స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ముస్లిం మహిళలు కనీసం గుప్పెడు మంది కూడా లేరు. మరి మీరు ఈ బిల్లు ద్వారా ఎవరికి ప్రాతినిథ్యం కల్పించాలనుకుంటున్నారు.. అవసరం ఉన్నవారికి ప్రాతినిథ్యం ఇవ్వాలి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ముస్లిం, ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ కోటా లేకపోవడం దీనిలోని ప్రధాన లోపం. అందుకే ఈ బిల్లును మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం” అని స్పష్టం చేశారు.