Mother Fought with The Crocodile : ఉత్తర ప్రదేశ్, బహ్రాయిచ్‌లోని ధాకియా గ్రామంలో సోమవారం సాయంత్రం ఒక తల్లి తన ఐదేళ్ల కుమారుడిని రక్షించుకోవడానికి మొసలితో పోరాడింది. వీరి ఇంటి దగ్గర ఉన్న కాలువ వద్ద బాలుడు ఆడుకుంటున్నప్పుడు, ఒక మొసలి అకస్మాత్తుగా నీటి నుండి బయటకు వచ్చి అతన్ని పట్టుకుంది. మొసలి బాలుడిని నీటిలోకి లాక్కెళ్ళడానికి ప్రయత్నిస్తుండగా, అతని అరుపులు విన్న తల్లి మాయ (40), వెంటనే అక్కడికి పరుగున వెళ్లి మొసలితో పోరాటం చేసి బిడ్డను రక్షించింది.
CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మాయ మొసలితో ఐదు నిమిషాలపాటు వీరోచితంగా పోరాడింది. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆమె తన చేతులతో మొసలిని కొడుతూ అడ్డుకుంది. తరువాత ఆమెకి ఒక ఇనుప రాడ్ దొరికింది, ఆ రాడ్‌తో మొసలిని బలంగా కొట్టింది. వెంటనే అది ఆమె కొడుకును వదిలిపెట్టింది. ఈ ఘటనలో మాయ, కుమారుడు ఇద్దరూ గాయపడ్డారు. మాయకు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు, కానీ వీరుకి తీవ్ర గాయాలు కావడంతో ఇంకా వైద్య సంరక్షణలో ఉన్నాడు. ఈ సంఘటన గురించి మాజీ గ్రామ సర్పంచ్ రాజ్కుమార్ సింగ్ అధికారులకు సమాచారం అందించారు. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామ్ సింగ్ యాదవ్ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి కుటుంబాన్ని కలిసింది. మొసలిని పట్టుకోవడానికి ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తామని యాదవ్ హామీ ఇచ్చారు.