Site icon HashtagU Telugu

Chopper Crash : హెలికాప్టర్ ఘటనలో ఆరుగురి మృతదేహాల గుర్తింపు!

Chopper

Chopper

తమిళనాడులో జరిగిన IAF హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13 మందిలో నలుగురు IAF, ఇద్దరు ఆర్మీ సిబ్బంది మొత్తం ఆరుగురి మృత దేహాలను గుర్తించారు. జూనియర్ వారెంట్ ఆఫీసర్లు ప్రదీప్ అరక్కల్, రాణా ప్రతాప్ దాస్, వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, లాన్స్ నాయక్ బి సాయి తేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ ఉన్నారు. అయితే లాన్స్ నాయక్ బి సాయి తేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతికకాయాలను గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

మిగిలిన భౌతికకాయాలను విమానంలో తరలించి, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బయలుదేరే ముందు ఢిల్లీ కాంట్‌లోని బేస్ హాస్పిటల్‌లో పుష్పగుచ్ఛం ఉంచుతారు. ఇంకా మిగిలిన వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. “కుటుంబ సభ్యుల శ్రేయస్సు చాలా ముఖ్యమైనది. కాబట్టి మేము గుర్తింపు ప్రక్రియను ముందుకు తీసుకువెళుతున్నామని” ఒక అధికారి చెప్పారు. డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, అతని డిఫెన్స్ అడ్వైజర్ బ్రిగేడియర్ LS లిడర్ ప్రమాదంలో మరణించారు, వారి మృతదేహాలను గుర్తించినందున ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో పూర్తి సైనిక లాంఛనాలతో దహనం చేశారు.

Exit mobile version