Railway Jobs: పదో తరగతి అర్హతతో రైల్వేలో 2422 జాబ్స్

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన 2000 కంటే ఎక్కువ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. దీని చివరి తేదీ సమీపించింది.

Published By: HashtagU Telugu Desk
Eastern Railway RRC ER

Eastern Railway RRC ER

పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రైల్వేలో చేరేందుకు ఇది గొప్ప అవకాశం. సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులకు సంబంధించిన 2000 కంటే ఎక్కువ ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. దీని చివరి తేదీ సమీపించింది. సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను నింపని అభ్యర్థులు ఇక దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ట్రేడ్‌లలో

ముంబై, భుసావల్, పూణే, నాగ్‌పూర్, సోల్పూర్ క్లస్టర్‌ల పరిధిలో ఈ పోస్టుల భర్తీ జరుగుతోంది.  వీటి పరిధిలో ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ సహా అనేక ట్రేడ్‌లలో మొత్తం 2422 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. శిక్షణ వ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది.

క్లస్టర్ వారీగా ఖాళీల వివరాలు

రైల్వే అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ముంబై క్లస్టర్ 1659, భుసావల్ క్లస్టర్ 418, పూణే క్లస్టర్ 152, నాగ్‌పూర్ క్లస్టర్ 114, సోల్పూర్ క్లస్టర్‌లో 79 పోస్టులకు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులన్నింటికీ అభ్యర్థుల ఎంపిక మెరిట్ జాబితా ఆధారంగా జరుగుతుంది.

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (హై స్కూల్) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కోర్సు చేయాలి.

వయోపరిమితి: 2022 డిసెంబర్ 15నాటికి అర్హతగల అభ్యర్థుల వయోపరిమితి కనిష్టంగా 15 సంవత్సరాలు, గరిష్టంగా 24 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు సెంట్రల్ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ 2023-24 ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.  విద్యార్హత, వయోపరిమితి గురించి పూర్తి సమాచారం కోసం మీరు నోటిఫికేషన్‌ను చూడొచ్చు.

దరఖాస్తు రుసుము: దరఖాస్తు చేయడానికి జనరల్, OBC, EWS కేటగిరీ వ్యక్తులు రుసుము రూ. 100 చెల్లించాలి. అయితే, SC, ST మరియు PH వర్గాలకు ఎటువంటి రుసుము ఉండదు. దరఖాస్తు రుసుమును డెబిట్, క్రెడిట్ లేదా నెట్ బ్యాంకింగ్ మోడ్ ద్వారా చెల్లించాలి.  ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ అధికారిక వెబ్‌సైట్ rrccr.com ద్వారా జనవరి 15లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

  Last Updated: 14 Jan 2023, 07:04 PM IST