Site icon HashtagU Telugu

PM Modi : మోర్బీ ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ..!!

Pm Modi (1)

Pm Modi (1)

గుజరాత్ లోని మోర్బీ కేబుల్ బ్రిడ్జి వంతెన కూలిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఘటనాస్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న అధికారులతో ప్రధాని సంభాషించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితిపై మోదీ వాకబు చేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

కాగా నిన్న రాజ్ భవన్ లో మోర్బీ ఘటనపై సమీక్ష నిర్వహించారు మోదీ. ఇవాళ కూడా ఘటనాస్థలాన్ని సందర్శించిన తర్వాత అధికారులతో మరోసారి భేటీ అయ్యారు. మోర్బీ ఘటనలో 141మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.