PM Modi: మోడీ అబుదాబి పర్యటన, రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు

  • Written By:
  • Updated On - February 13, 2024 / 09:26 PM IST

PM Modi: యూఏఈతో భారత్‌కు ఎంతో అనుబంధం ఉందన్నారు మోదీ. భారత్ నుంచి బయలు దేరి యూఏఈ వెళ్లిన ప్రధాని మోదీకి షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహాన్‌ స్వాగతం పలికి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులో అరబ్‌ సైన్యం సమర్పించిన గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. సోదరా అంటూ UAE అధ్యక్షుడిని సంబోధించిన ప్రధాని మోదీ, తనకు అందించిన స్వాగతానికి అభినందనలు తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో తాను ఆయనను కలవడం ఇది ఏడోసారని గుర్తు చేశారు.

యూఏఈకి రావడం సొంతింటికి వచ్చినట్టుగా, కుటుంబసభ్యులను కలిసినట్టుగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. భారత్‌- యూఏఈ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని మోదీ అన్నారు. జాయెద్‌ చొరవ వల్లే అబూధాబిలో హిందూ దేవాలయం రూపుదిద్దుకుందని మోదీ కొనియాడారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. ఈ సందర్భాంగా రెండు దేశాల అధికారులు రెండు దేశాధినేతల సమక్షంలో ఒప్పందాలను మార్చుకున్నారు. మోదీ గౌరవార్ధం జాయెద్‌ స్టేడియంలో ఆహ్లాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను కన్నుల పండువగా నిర్వహించారు. భారత్‌ నుంచి పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటనపై యూఏఈలోని ప్రవాస భారతీయుల్లో ఉత్సాహం నెలకొంది. గత తొమ్మిదేళ్లలో, యుఎఇతో భారతదేశ సహకారం వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, ఆహారం, ఇంధన భద్రత, విద్య వంటి వివిధ రంగాలలో అనేక రెట్లు పెరిగిందని అన్నారు. యుఎఇ కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రధాని అక్కడ దిగనున్నారు. ఆ తర్వాత యుఎఇ దేశాధినేతతో పాటు పలువురు నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. మోదీ రాక సందర్భంగా యూఏఈలో ఏర్పాటు చేసిన అహ్లాన్ మోదీ కార్యక్రమం ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ గౌరవార్థం నిర్వహించిన కార్యక్రమాల్లో 700 మందికి పైగా సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన ఉంది.