Site icon HashtagU Telugu

Telangana BJP: మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్

Telangana BJP

Telangana BJP

Telangana BJP: మోదీ పర్యటనతో తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో జోష్ కనిపిస్తుంది. పార్లమెంట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించడం రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని బలోపేతం చేసినట్లయింది. దీంతో మోడీ కేంద్రంలో మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమంటున్నారు తెలంగాణ రాజకీయ విశ్లేషకులు.

మోడీ తెలంగాణ పర్యటన ప్రభావం భారీగానే ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తలు మోడీ పర్యటనని ప్రతిష్టాత్మాకంగా తీసుకున్నారు. బహిరంగ సభల్లో మోడీ స్పీచ్ వచ్చే లోకసభ ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపనుందని బీజేపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. అంతేకాదు బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో మోడీ కూడా తెలంగాణపై ఆశలు పెట్టుకున్నారట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీల సీట్లను గెలుచుకోవడంపైనే మోదీ దృష్టి పెట్టారు. జగిత్యాలలో మోడీ సమావేశం సందర్భంగా బిజెపి నాయకత్వంలో ఆనందం వెల్లువిరిసింది. ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన మెహర్ నేతకాని సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధి గోమాస శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించడం ద్వారా పెద్దపల్లి ఎంపీ సీటు బీజేపీకేనని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .

మరోవైపు కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో.. మంగళవారం టికెట్లను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ లో ఆందోళనలను మొదలయ్యాయి. సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడటం, ఎమ్మెల్సీ కవిత అరెస్టు మరియు ఉమ్మడి జిల్లాలో ప్రజల వ్యతిరేకత వంటి సవాళ్లు బీఆర్ఎస్ ఎదుర్కోక తప్పదు.

Also Read: 550 Jobs : రైల్వేలో 550 జాబ్స్.. టెన్త్ పాసై, ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు