Modis First Signature : ప్రధానిగా తొలి సంతకం చేసిన మోడీ.. ఆ ఫైలుపై సిగ్నేచర్ !

ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైలుపై చేశారు.

Published By: HashtagU Telugu Desk
Modis First Signature

Modis First Signature

Modis First Signature : ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోడీ తొలి సంతకాన్ని పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల ఫైలుపై చేశారు. దీంతో దేశంలోని 9.3 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు రూ.20,000 కోట్లు జమ చేసేందుకు లైన్ క్లియర్ అయింది.

We’re now on WhatsApp. Click to Join

పీఎం కిసాన్ నిధుల ఫైలుపై సంతకం చేసిన సందర్భంగా ప్రధాని మోడీ(Modis First Signature) మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది. మా బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించేలా పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశాను. రానున్న రోజుల్లో రైతుల జీవితాలను బాగుచేసే మరిన్ని అంశాలపై పనిచేస్తాం. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యతను తీసుకుంటాం’’ అని వెల్లడించారు. ఇక కేంద్ర క్యాబినెట్ తొలి భేటీ ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ నివాసంలో జరగనుంది.  తొలి 100 రోజుల పాలనా కాలానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో డిస్కస్ చేయనున్నారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఇవాళ రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిన్నర్ ఇవ్వనున్నారు.

Also Read :New Chief Minister : ఒడిశా ముఖ్యమంత్రిగా సురేశ్‌ పుజారి ? రేపటిలోగా క్లారిటీ

బిట్టుకు గొప్ప అవకాశం

పంజాబ్‌లోని లుథియానా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రవనీత్ సింగ్‌ బిట్టుకు కూడా ఈసారి కేంద్ర మంత్రి పదవి దక్కింది.  ఈ ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా ఆయనపై బీజేపీ అగ్రనాయకత్వం విశ్వాసం ఉంచింది. పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడు కావడం బిట్టుకు ప్లస్ పాయింట్. పంజాబ్‌ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన బియాంత్.. సీఎంగా ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యారు. ఆ కుటుంబ వారసుడు కావడం కూడా రవనీత్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడానికి ప్రధాన కారణమైందని అంటున్నారు.

  Last Updated: 10 Jun 2024, 01:31 PM IST