Site icon HashtagU Telugu

PM Modi Dress : గణతంత్రంలో మోడీ ఎన్నికల డ్రెస్

Modi Dress

Modi Dress

గణతంత్ర వేడుకల్లోనూ ప్రధాని మోడీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఒరవడిని చూపాడు. ఆయన వేసుకునే డ్రెస్ మీద చాలా స్టోరీలు ఇప్పటికే వచ్చాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల చిహ్నాలతో ఉండే డ్రెస్ వేసుకోవడం పెద్ద చర్చగా మారింది. ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున తన సాంప్రదాయ తలపాగా రూపాన్ని వదిలివేసాడు. రాష్ట్ర పుష్పం బ్రహ్మకమల చిత్రంతో ఉత్తరాఖండ్‌కు చెందిన సాంప్రదాయ టోపీని ధరించాడు. దాన్ని మణిపూర్ నుండి తెచ్చారు అని తెలుస్తుంది.
కేదార్‌నాథ్‌లో ప్రార్థనలు చేసినప్పుడల్లా మోదీ బ్రహ్మకమలాన్ని ఉపయోగిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో ప్రధాన మంత్రి తలపాగాలు హైలైట్‌గా ఉన్నాయి. కానీ ఈసారి భిన్నంగా కనిపించాడు.గత సంవత్సరం 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని జామ్‌నగర్ నుండి తీసుకొచ్చిన ప్రత్యేక తలపాగాను ధరించాడు. ఆనాడుఎరుపు రంగు నమూనాలు మరియు పొడవాటి ప్లూమ్‌తో కుంకుమ తలపాగాను ఎంచుకున్నాడు.2014లో తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం కోసం .. చివరన ఆకుపచ్చ రంగుతో ప్రకాశవంతమైన ఎరుపు రంగు జోధ్‌పురి బంధేజ్ తలపాగాను ఎంచుకున్నాడు.2015లో బహుళ-రంగు క్రిస్‌క్రాస్ లైన్‌లతో కప్పబడిన పసుపు తలపాగాను, 2016లో గులాబీ మరియు పసుపు రంగులలో టై మరియు డై టర్బన్‌ను ఎంచుకున్నాడు.2017లో ప్రధానమంత్రి తలపాగా ముదురు ఎరుపు మరియు పసుపు రంగుల మిశ్రమంతో పాటు బంగారు రేఖలతో నిండి ఉంది. 2018లో ఎర్రకోటలో కుంకుమపు తలపాగా ధరించాడు. ఇప్పుడు 73 వ గణతంత్రం సందర్భంగా వేసిన డ్రెస్ మణిపూర్, ఉత్తరాఖండ్‌లలో వచ్చే ఎన్నికల దృష్ట్యా ధరించిదని కామెంట్స్ ఉన్నాయి. ఏది ఏమైనా డ్రెస్ సెలక్షన్ లో మోడీ సూపర్.

Exit mobile version