దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భయంకర కారు పేలుడు ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడ జరిగిన ఒక అధికారిక సమావేశంలో మాట్లాడుతూ ఈ ఘటనపై తన బాధను వ్యక్తం చేశారు. “ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పేలుడు నన్ను తీవ్రంగా కలచివేసింది. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం,” అని ప్రధాని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Ande Sri : ఇక సెలవు.. ముగిసిన అందెశ్రీ అంత్యక్రియలు
మోదీ స్పష్టం చేస్తూ, ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమని అన్నారు. “దేశ భద్రతను కించపరచే కుట్రదారులను చట్టం ముందు నిలబెడతాం. నిందితులు ఎక్కడ దాక్కున్నా వారిని వెంబడించి పట్టుకుంటాం. దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఈ ఉగ్రకుట్ర వెనుక ఉన్న ప్రతి సంబంధాన్ని బట్టబయలు చేస్తాం” అని ఆయన హెచ్చరించారు. దేశ భద్రత, ప్రజల ప్రాణరక్షణ విషయంలో రాజీకి తావు ఉండదని ఆయన పేర్కొన్నారు.
Jubilee Hills By-Election 2025: పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం
అంతేకాక, మోదీ దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. పేలుడు దర్యాప్తు పురోగతిపై ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసిందని, ఇది కేవలం ఢిల్లీపై దాడి కాదని, మొత్తం భారతదేశంపై ఉగ్రవాదుల సవాలు అని మోదీ అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దేశ ఐక్యతకు, శాంతికి భంగం కలిగించే శక్తులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలతో భద్రతా సంస్థలు మరింత చురుకుగా పనిచేస్తూ ఉగ్రవాద నెట్‌వర్క్‌పై దృష్టి సారించాయి.
