Site icon HashtagU Telugu

Rahul Gandhi : బిలియనీర్ మిత్రుల కోసం రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోడీ – రాహుల్

Rahul Mod

Rahul Mod

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)..ప్రధాని మోడీ (Modi) ఫై కీలక ఆరోపణ చేసారు. తన బిలియనీర్ మిత్రుల కోసం ఏకంగా రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని..కానీ మేమైతే ఆ మొత్తాన్ని భారతీయుల బాధతలను తీర్చేందుకు వాడేవాళ్లమని రాహుల్ అన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావిడి నడుస్తుంది. దీంతో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విమర్శలు , ప్రతి విమర్శలు , ఆరోపణలతో వాడి వేడిగా నడుస్తుంది. ఇక సోషల్ మీడియా వేదికగా కూడా ఇదే నడుస్తుంది. తాజాగా రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ఫై కీలక ఆరోపణలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రధాని మోడీ .. తన బిలియనీర్ మిత్రుల కోసం ఏకంగా రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని రాహుల్ ఆరోపించారు. ఇలాంటి నేరానికి పాల్పడిన మోడీని దేశం ఎన్నటికీ క్షమించదని విమర్శించారు. మీమైతే ఆ డబ్బును దేశంలోని నిరుపేదలకు , మహిళలకు అందజేసేవాళ్లమని చెప్పుకొచ్చారు. ఈ డబ్బుతో ప్రతి ఏడాది 16 కోట్ల మంది ఉద్యోగులకు లక్ష ఇచ్చేవాళ్లమని , 16 కోట్ల మంది మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తే వాళ్ల జీవితాలు మారిపోయి ఉండేవన్నారు. 10 కోట్ల మంది రైతుల రుణాలు రద్దు చేస్తే.. ఎంతోమంది రైతుల ఆత్మహత్యలు ఆపేవాళ్లమని చెప్పుకొచ్చారు. 20 ఏళ్లపాటు రూ.400లకే గ్యాస్‌ సిలిండర్లను దేశ ప్రజలకు అందించేవాళ్లమన్నారు. భారతీయ ఆర్మీకి మూడేళ్ల ఖర్చును ఆ డబ్బులతో తీర్చేవాళ్లమన్నారు. ఆ డబ్బుతో దళిత, గిరిజన,వెనుకబడిన తరగతుల ప్రజలకు గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందించవచ్చని పేర్కొన్నారు. కానీ మోడీ మాత్రం అదానీ లాంటి బిలియనీర్ మిత్రులకు రుణమాఫీ చేసి ప్రజలను మోసం చేసారని రాహుల్ ఆరోపించారు. ప్రస్తుతం రాహుల్ చేసిన ట్వీట్ ఫై అంత మాట్లాడుకుంటున్నారు.

Read Also : Weight Loss: ల‌వంగాలు కూడా బ‌రువును త‌గ్గిస్తాయా..? ఎలాగో తెలుసా..?