PM Modi: మోడీ వికసిత్ భారత్ నినాదం.. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యం

  • Written By:
  • Updated On - March 25, 2024 / 10:46 AM IST

PM Modi: అభివృద్ధి, సంక్షేమ నినాదంతో మోదీ సర్కార్ మూడోసారి అధికారం అందుకోవాలని పట్టుదలగా ఉంది. గత పదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వాటి వివరాలను ప్రజల ముందు ఉంచుతోంది. రోడ్లు, రైల్వేలు, పేదలకు ఇళ్ల నిర్మాణం, ఎల్పీజీ కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ , నమామి గంగే, కొవిడ్ సమయంలో అందించిన టీకాల సమాచారాన్ని ప్రజలకు వివరిస్తోంది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు వికసిత్ భారత్ నినాదం అందుకుంది. మరో మూడేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని మోదీ సర్కార్ ధీమాగా ఉంది. ఈ అభివృద్ధి యాత్ర కొనసాగాలంటే తమను మరోసారి ఆశీర్వదించాలని కోరుతోంది.

లోక్ సభ ఎన్నికలకు భాజపా 111 మంది పేర్లతో ఐదో జాబితా విడుదల చేసింది. 17 రాష్ట్రాలు నుంచి 111 లోక్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కేంద్రమంత్రులు నిత్యానందరాయ్, గిరిరాజ్ సింగ్ , ఆర్కే సింగ్ , ధర్మేంద్ర ప్రధాన్ లకు తాజా జాబితాలో చోటు దక్కింది. సహాయ మంత్రులు అశ్వినీ కుమార్ చౌబే, వీకే సింగ్ తో పాటు బిశ్వేశ్వర్ టుడూలతోపాటు ఎంపీ వరుణ్ గాంధీలకు స్థానం లభించలేదు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు భాజపా సీటు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో 400 సీట్లు దక్కించుకోవాలని బీజేపీ ఫిక్స్ అయ్యింది.