Site icon HashtagU Telugu

‘డేటా బేస్’ పాల‌న‌పై మోడీ దిశానిర్దేశం

బీజేపీ మార్క్ ప‌రిపాల‌న సాగించాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ యోచిస్తున్నారు. ఆ మేర‌కు బీజేపీ పాలిత రాష్ట్రాల 12 మంది ముఖ్య‌మంత్రుల‌కు దిశానిర్దేశం చేశాడు. వార‌ణాసిలోని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న బీజేపీ రాష్ట్రాల సీఎంల‌తో భేటీ అయ్యాడు. సాంకేతికత ఆధారంగా డేటా ఆధారిత పాలన చేయాల‌ని ఆదేశించాడు. “లైసెన్స్ రాజ్”ను అంతం చేసే దిశ‌గా పాల‌న ఉండాల‌ని సూచించాడు.వాతావరణాన్ని తట్టుకునే మౌలిక సదుపాయాలు, సహజ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని మార్గ‌ద‌ర్శ‌నం చేశాడు. బిజెపి అధికారిక ప్రకటనలో.బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీకి చెందిన ఉపముఖ్యమంత్రులు మరియు ఇతర అగ్రనేతలు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. సుపరిపాలన విధానాలను పంచుకునే లక్ష్యంతో మోడీ ఈ స‌మావేశం నిర్వ‌హించాడు.

Balakrishna, CBN : పాపం బాబు.! బాల‌య్య క‌న్నీళ్ల క‌థ‌!!

ప్రధాని మోడీ పాలనకు అనుగుణంగా అనేక కోణాలను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హైలైట్ చేశారు. బిజెపి ప్రభుత్వం ప్ర‌తి రాష్ట్రంలోనూ ఏదో ఒక రంగంలో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలని మోడీ సూచించాడు. కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన నినాదంతో ముందుకెళ్లాల‌ని ఆదేశించాడు. ‘ఒక జిల్లా, ఒకే ఉత్పత్తి రాష్ట్రాలు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే అంశాన్ని ఈ స‌మావేశంలో ప‌రిశీలించారు. యువత అభివృద్ధి, మహిళా సాధికారత ప్రాధాన్యతా రంగాల ప్రాధాన్యత ప్ర‌భుత్వ పాల‌న‌లో ఉండాల‌ని ఆదేశించాడు.