Site icon HashtagU Telugu

Delhi CM Arvind Kejriwal : కేజ్రీవాల్ మాట్లాడుతుండ‌గా మోదీ.. మోదీ అంటూ నినాదాలు.. ఢిల్లీ సీఎం ఏం అన్నాడో తెలుసా?

Arvind Kejriwal

Modi slogans while Delhi CM Arvind Kejriwal speaking in University

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) ప్ర‌సంగిస్తున్న కార్య‌క్ర‌మంలో బీజేపీ మ‌ద్ద‌తుదారులు, విద్యార్థులు మోదీ, మోదీ(Modi) అంటూ పెద్ద‌పెట్టున నినాదాలు చేశారు. కేజ్రీవాల్ వారించిన‌ప్ప‌టికీ నినాదాలు ఆపలేదు. గురువారం గురుగోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ తూర్పు ఢిల్లీ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతున్న క్ర‌మంలో కొంద‌రు విద్యార్థులు మోదీ.. మోదీ అనే నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విద్యార్థులు మోడీ.. మోడీ అని నినాదాలు చేయడంతో ఢిల్లీ సిఎం త‌న ముఖంపై చిరున‌వ్వుతో.. నేను చెప్పేది ఐదు నిమిషాలు వినండి.. ఈ పార్టీ, ఆ పార్టీ వారిని నేను అభ్య‌ర్థిస్తున్నాను. మీకు న‌చ్చ‌క‌పోతే మీరు త‌ర్వాత నినాదాలు కొన‌సాగించ‌వ‌చ్చు అని సూచించారు. అయినా, కొంద‌రు విద్యార్థులు మోదీ, మోదీ అనే నినాదాలు ఆప‌క‌పోవ‌టంతో కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇలాంటి నినాదాలు చేయ‌డం ద్వారా విద్యావ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది అని అనుకుంటే 70ఏళ్ల క్రితం ఇది జ‌రిగి ఉండేది అని అన్నారు. నా ఆలోచ‌న‌లు మీకు న‌చ్చ‌క‌పోవ‌చ్చని నాకు తెలుసు. మీరు వ్యాఖ్య‌లు చేయవ‌చ్చు. కానీ ఇది స‌రైన‌ది కాదు. ఈ ప్ర‌జాస్వామ్యంలో మాట్లాడే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంది అని అన్నారు. అలాగే స్టేజిపై ఉన్నవారితో నన్నెందుకు పిలిచినట్టు అని కూడా కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషిని కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడే స‌మ‌యంలోనూ కొంద‌రు విద్యార్థులు నినాదాలు చేయ‌డం క‌నిపించింది. దీంతో ఆమె కొంచెం ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చారు. ఇందుకే విద్య అవ‌స‌రం.. అంటూ నినాదాలు చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఈ వీడియోలపై ఆప్ పార్టీ కూడా స్పందిస్తూ తమకు మద్దతుగా పోస్ట్ చేశాయి. మోడీ నినాదాలు చేసేవారికి కేజ్రీవాల్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడని ఆ పార్టీ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు.

ఇక గురుగోవింద్ సింగ్ ఇంద్ర‌ప్ర‌స్థ విశ్వ‌విద్యాల‌యం తూర్పు ఢిల్లీ క్యాంప‌స్ ఆప్ నేతృత్వంలోని న‌గ‌ర ప్ర‌భుత్వానికి, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాకు మ‌ధ్య వివాదంలో మారింది. కొత్త‌గా నిర్మించిన క్యాంప‌స్ ను తామే ప్రారంభిస్తామ‌ని ఇరు ప‌క్షాలు పేర్కొన్నాయి. కొత్త క్యాంప‌స్ క్రెడిట్ ద‌క్కించుకొనేందుకు ఇరు పార్టీలు ఒక‌రినొక‌రు ఆరోపించుకుంటున్నారు.